తెలంగాణ

telangana

ETV Bharat / state

LIVE UPDATES : నా క్యారెక్టర్‌ను ఒక్క ఘటనతో తక్కువ చేశారు : అల్లు అర్జున్‌ - ALLU ARJUN PRESS MEET LIVE UPDATES

LIVE UPDATES
LIVE UPDATES (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 21, 2024, 7:59 PM IST

Updated : Dec 21, 2024, 8:26 PM IST

పుష్ప-2 ప్రీమియర్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనపై అసెంబ్లీలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ప్రస్తావించగా సీఎం స్పందించారు. దీనిపై అల్లు అర్జున్​ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

LIVE FEED

8:23 PM, 21 Dec 2024 (IST)

  • నా పిల్లలు కూడా శ్రీతేజ్‌ అంత వయసులోనే ఉన్నారు: అల్లు అర్జున్‌
  • పిల్లలు తొక్కిసలాటలో ఉన్నారని తెలిసీ అలా చేసేవ్యక్తిని కాదు
  • అనుమతి ఇస్తే.. ఇప్పుడు కూడా ఆస్పత్రికి వెళ్లి పరామర్శిస్తా: అల్లు అర్జున్‌
  • నా పిల్లలు కూడా శ్రీతేజ్‌ అంత వయసులోనే ఉన్నారు: అల్లు అర్జున్‌
  • పిల్లలు తొక్కిసలాటలో ఉన్నారని తెలిసీ అలా చేసేవ్యక్తిని కాదు..
  • అనుమతి ఇస్తే.. ఇప్పుడు కూడా ఆస్పత్రికి వెళ్లి పరామర్శిస్తా: అల్లు అర్జున్‌
  • నా అభిమానులు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుకుంటాను: అల్లు అర్జున్‌
  • నేను నిర్లక్ష్యంగా వ్యవహరించాననేది సరికాదు: అల్లు అర్జున్‌
  • పోలీసుల అనుమతి తీసుకునే మా నాన్న ఆస్పత్రికి వెళ్లారు: అల్లు అర్జున్

8:13 PM, 21 Dec 2024 (IST)

  • పిల్లలు ఆస్పత్రిలో ఉన్నారంటే మా వాసును పంపించాను: అల్లు అర్జున్
  • నేను కూడా ఆస్పత్రికి వెళ్తానంటే వద్దని అన్నారు: అల్లు అర్జున్‌
  • ఆస్పత్రికి వెళ్తే మరో ఘటన జరుగుతుంది కాబట్టి వద్దన్నారు: అల్లు అర్జున్
  • ఈ బాధతో నేను సక్సెస్‌ మీట్‌ను కూడా రద్దు చేసుకున్నా: అల్లు అర్జున్‌
  • ప్రజలు థియేటర్‌ వచ్చి సంతోషపడేందుకే సినిమాలు చేస్తాం: అల్లు అర్జున్‌
  • బాధిత కుటుంబానికి అవసరమైనంత సాయం చేయాలని భావించాను: అల్లు అర్జున్‌
  • మన తెలుగువాళ్ల స్థాయిని పెంచేందుకే నేను సినిమాలు చేస్తున్నా: అల్లు అర్జున్
  • ఎన్నో ఏళ్లపాటు కాపాడుకున్న నా క్యారెక్టర్‌ను ఒక్క ఘటనతో తక్కువ చేశారు : అల్లు అర్జున్

8:12 PM, 21 Dec 2024 (IST)

  • పోలీసుల అనుమతి ఉంటేనే నేను థియేటర్‌కు వెళ్లాను: అల్లు అర్జున్
  • నేను థియేటర్‌ ముందు రోడ్‌ షో చేయలేదు: అల్లు అర్జున్
  • థియేటర్‌లోకి వెళ్తున్నప్పుడు ఒక్క నిమిషం కారు ఆగింది: అల్లు అర్జున్
  • అభిమానులకు కృతజ్ఞతలు చెప్తూ ముందుకు వెళ్లమని చెప్పాను: అల్లు అర్జున్‌
  • నేను థియేటర్‌లోకి వెళ్లిన తర్వాత నాతో ఎవరూ ఏమీ చెప్పలేదు: అల్లు అర్జున్‌
  • పోలీసులు వచ్చి జనం అధికంగా గుమికూడారు వెళ్లమని చెప్తే వెళ్లిపోయాను
  • తొక్కిసలాట ఘటన మరుసటిరోజు ఉదయం వరకు నాకు తెలియదు

8:04 PM, 21 Dec 2024 (IST)

  • శ్రీతేజ్‌ కుటుంబానికి క్షమాపణలు చెప్తున్నా: అల్లు అర్జున్‌
  • ఒకరి తప్పు వల్ల జరిగిన ఘటన కాదు ఇది: అల్లు అర్జున్
  • శ్రీతేజ్‌ ఆరోగ్యం గురించి గంటగంటకు తెలుసుకుంటున్నా: అల్లు అర్జున్
  • ఘటనపై మిస్‌ ఇన్‌ఫర్మేషన్‌, మిస్‌ కమ్యూనికేషన్‌ జరుగుతోంది: అల్లు అర్జున్
  • ఈ ఘటన విషయంలో నా క్యారెక్టర్‌ను కించరపరిచారు: అల్లు అర్జున్
  • నా మీద కొంత తప్పుడు ప్రచారం జరుగుతోంది: అల్లు అర్జున్‌
  • ఘటన సమయంలో నేను ఏదో మాట్లాడానని అంటున్నారు: అల్లు అర్జున్‌

8:01 PM, 21 Dec 2024 (IST)

  • ఆలస్యంగా వచ్చినందుకు క్షమాపణలు: అల్లు అర్జున్‌
  • సంధ్య థియేటర్‌లో జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరం: అల్లు అర్జున్‌
  • ఇది పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిన ఘటన: అల్లు అర్జున్‌
Last Updated : Dec 21, 2024, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details