తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇకపై పది పాసైతే చాలు - ఎంట్రెన్స్​ టెస్ట్ లేకుండానే నేరుగా ఇంటర్‌లోకి! - INTER ADMISSIONS

సంక్షేమ గురుకులాల్లో పది పాసైన విద్యార్థులకు నేరుగా ఇంటర్‌లో ప్రవేశాలు కల్పించనున్న గురుకుల సొసైటీలు - 2025 -26 నుంచి ప్రవేశ పరీక్షలు లేకుండానే అడ్మిషన్లు - కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం

GURUKUL INTER ADMISSION
Inter Admissions without Entrance Exam in Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 24, 2024, 9:25 AM IST

Inter Admissions without Entrance Exam in Telangana : రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో పదో తరగతి పాసైన విద్యార్థులకు గురుకుల సొసైటీలు ఇక నేరుగా ఇంటర్మీడియట్​లో ప్రవేశాలు కల్పించనున్నాయి. దానితోపాటు బ్యాక్​లాగా ఖాళీల సమస్యలు కూడా లేకుండా చర్యలు చేపట్టాయి. ఈ మేరకు గురుకుల సొసైటీలు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశాయి. వచ్చే 2025-26 విద్యాసంవత్సరం నుంచే గురుకుల ఇంటర్​, డిగ్రీ కాలేజీల్లో స్పెషల్​ ఎంట్రన్స్​ టెస్ట్ లేకుండా గురుకుల విద్యార్థులకు నేరు​గా అడ్మిషన్లు లభించనున్నాయి. అనంతరం మిగిలిన సీట్లకు దరఖాస్తులు స్వీకరించి ప్రవేశాలు కల్పించనున్నాయి.

ఇప్పటికే ఎస్సీ గురుకుల సొసైటీలో ఇంటర్‌ ప్రవేశాలకు చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టు మంచి ఫలితాలను ఇస్తోంది. దీంతో ఈ విధానాన్ని అన్ని గురుకులాల్లో అమలు చేయాలని సొసైటీలు నిర్ణయించాయి. ఇప్పటికి మంత్రి పొన్నం ప్రభాకర్​ కూడా బీసీ గురుకులాల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచే నేరుగా ఇంటర్‌ ప్రవేశాలు కల్పిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకుల సొసైటీలలో సుమారు వెయ్యి గురుకుల పాఠశాలలు ఇంటర్మీడియట్‌ స్థాయికి అప్‌గ్రేడ్‌ అయ్యాయి. ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో 80 సీట్ల చొప్పున అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయి.

నీట్​, ఇంజినీరింగ్‌ ప్రవేశపరీక్షలకు శిక్షణ లేకపోవడంతో : గత కొన్నేళ్లుగా సొసైటీలు వేర్వేరుగా ప్రవేశపరీక్షలు నిర్వహిస్తూ ప్రతిభ ఆధారంగా ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. నాలుగైదేళ్ల క్రితం ఇంటర్మీడియట్‌ సీట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో డిమాండ్​ ఎక్కువగా ఉండేది. రెండేళ్ల క్రితమే అన్ని గురుకులాలు కళాశాలలుగా మారాయి. దీంతో సీట్ల సంఖ్య కూడా పెరిగింది. రెండు మూడేళ్లుగా సొసైటీల్లో ఇంటర్మీడియట్‌ 30%, గురుకుల డిగ్రీ కళాశాలల్లో సగానికిపైగా సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. స్పాట్‌ అడ్మిషన్లు కూడా ఆలస్యం కావడంతో సీట్లు ఆశించినవారికి నిరాశే మిగులుతోంది.

అక్కడే టెన్త్​ క్లాస్​ చదివిన విద్యార్థులకు నేరుగా ప్రవేశాలు లేకపోవడంతో ప్రభుత్వ కళాశాలలకు వెళ్తున్నారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(సీవోఈ)ల్లో మినహా మిగతా కాలేజీల్లో నీట్​, ఇంజినీరింగ్‌ ప్రవేశపరీక్షలకు శిక్షణ లేకపోవడంతో కొన్నిచోట్ల ప్రవేశాలకు ముందుకు రావడంలేదు. రాష్ట్రం వెయ్యి గురుకులాలు ఉంటే సీవోఈల సంఖ్య మాత్రం 50 ఉంది. ఈ పరిస్థితిని అంచనా వేసిన సీవోఈల సంఖ్యను పెంచాలని, టెన్త్​ పూర్తయిన విద్యార్థులకు నేరుగా ఇంటర్మీడియట్​లో అడ్మిషన్లు కల్పించాలని నిర్ణయించాయి.

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల - ముఖ్యమైన తేదీలు ఇవే

ఇంటర్​ స్టూడెంట్స్​ కోసం '90 డేస్' ప్లాన్ - బ్యాక్ బెంచర్స్​కు స్పెషల్​ క్లాసెస్

ABOUT THE AUTHOR

...view details