తెలంగాణ

telangana

ETV Bharat / state

గొర్రెల పంపిణీ​లో రూ.700 కోట్ల స్కామ్ - ఎవరి వాటా ఎంత? - పెద్దల పాత్రపై ఏసీబీ ఆరా - Sheep Distribution Scam in Telangana - SHEEP DISTRIBUTION SCAM IN TELANGANA

ACB Investigation on Sheep Distribution Case : గొర్రెల సరఫరా పథకం కుంభకోణంపై ఏసీబీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కుంభకోణంలో సొమ్ము పంపకాలపై దృష్టి సారించింది. నిందితుడు మొహిదుద్దీన్‌ బ్యాంకు లావాదేవీలను పరిశీలించనుంది. మరోవైపు ఇందులోని పెద్దల పాత్రను నిగ్గు తేల్చే అవకాశం ఉంది.

Sheep Distribution Scam in Telangana
Sheep Distribution Scam in Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 6, 2024, 8:25 AM IST

Sheep Distribution Scam in Telangana Updates :గొర్రెల పంపిణీ పథకంలో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే రూ.700 కోట్ల కుంభకోణం జరిగినట్లు గుర్తించింది. ఒక ప్రభుత్వ పథకంలో ఇంత భారీ మొత్తం కొల్లగొట్టడం వెనక పెద్దల పాత్ర తప్పనిసరిగా ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తదుపరి దర్యాప్తునకు ప్రాధాన్యత సంతరించుకుంది.

మరోవైపు ఈ పథకానికి అనధికారిక కాంట్రాక్టర్‌గా వ్యవహరించిన లొలొన కంపెనీ నిర్వాహకుడు మొహిదుద్దీన్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతను దుబాయ్‌కు పారిపోయాడు. తిరిగి రప్పించేందుకు ఏసీబీ లుక్‌ఔట్‌ నోటీస్‌ జారీ చేయించింది. అతణ్ని విచారిస్తే పెద్దల పాత్రపై కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తోంది. కొట్టేసిన సొమ్మును ఎవరెవరు పంచుకున్నారో తేల్చేందుకు అరెస్టైన నిందితుల, మొహిదుద్దీన్‌ బ్యాంకు లావాదేవీలపై ఏసీబీ ఫోకస్ పెట్టిెంది.

అనుకూలమైన అధికారులను నియమించుకుని :ఈ కేసులో కామారెడ్డి ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకుడు డా.రవి, మేడ్చల్‌ జిల్లా పశువైద్యశాఖ సహాయ సంచాలకుడు డా.ఎం.ఆదిత్య కేశవసాయి, రంగారెడ్డి జిల్లా భూగర్భ జలశాఖ అధికారి పసుల రఘుపతిరెడ్డి, వయోజన విద్యాశాఖ ఉపసంచాలకుడు సంగు గణేశ్, పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకుడు అంజిలప్ప, సహాయ సంచాలకుడు కృష్ణయ్యను గతంలోనే అరెస్ట్‌ చేశారు. ఇటీవలే రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్యకు ఎండీగా పనిచేసిన రాంచందర్‌నాయక్‌తోపాటు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఓఎస్డీగా పనిచేసిన కల్యాణ్‌ను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

అప్పటి ప్రభుత్వంలో పశుసంవర్ధక శాఖను పర్యవేక్షించిన పెద్దల ఆశీస్సులతో ఉన్నతాధికారులను మొహిదుద్దీన్‌ గుప్పిట పెట్టుకున్నట్లు ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. తద్వారా శాఖలో తమకు అవసరమైన పోస్టుల్లో అనుకూలమైన అధికారులను నియమించుకుని కుట్రలకు తెర లేపినట్లు నిర్ధారించారు. గొర్రెల కొనడం మొదలు, నగదును సరఫరాదారుల ఖాతాల్లో కాకుండా మొహిదుద్దీన్‌ బినామీల ఖాతాల్లో పడేలా రికార్డుల్ని తారుమారు చేయడంలో వీరు కీలకంగా వ్యవహరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఒక్కో యూనిట్‌లో రూ.33,000ల వరకు స్వాహా :ఒక్కో యూనిట్‌లో మొహిదుద్దీన్‌ ముఠా సుమారు రూ.33,000ల వరకు కొట్టేసినట్లు ఏసీబీ దర్యాప్తులో బహిర్గతమైంది. చాలా యూనిట్లను సరఫరా చేయకుండానే మొత్తం నిధుల్ని స్వాహా చేసినట్లు తేలింది. ఈ నేపథ్యంలోనే పలువురికి రూ.కోట్లలో వాటాలు ముట్టాయి. ప్రభుత్వ నిధులను తొలుత మొహిదుద్దీన్‌ బినామీల ఖాతాలకు మళ్లించినట్లు వెల్లడి కావడంతో ఏసీబీ అధికారులు వాటిని విశ్లేషించడం ద్వారా కీలక సమాచారం రాబట్టారు.

రూ.2 కోట్లు కాదు - ఏకంగా రూ.700 కోట్లు నొక్కేశారు! - గొర్రెల పంపిణీ స్కామ్​లో తవ్వేకొద్దీ విస్తుపోయే నిజాలు - Two Officers Arrest in Sheep Scam

గొర్రెల పంపిణీ స్కామ్​ కేసు - మరో ఇద్దరు కీలక వ్యక్తుల అరెస్టు - Sheep Distribution Scam Case Update

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details