తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రేయసి దక్కలేదు - ఆ విషయం ఓర్చుకోలేక స్నేహితుడినే చంపేశాడు - MAN KILLED FRIEND FOR HIS LOVER

ప్రేయసి కోసం స్నేహితుడిని చంపిన యువకుడు - తనతో మాటలు చనువుగా ఉండడం చూసి తట్టుకోలేక ఘటన

Young Man Who Killed His Friend For His Lover
Young Man Who Killed His Friend For His Lover (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 13, 2024, 1:45 PM IST

Young Man Who Killed His Friend :ప్రేమించిన అమ్మాయి కాస్త ఎవరితోనైన కాస్త క్లోజ్‌గా మాట్లాడినా, చనువుగా ఉన్నా చాలావరకు యువకులు అది సహించలేరు. మాటలు మాన్పించడమో లేక ఆ అబ్బాయితో గొడవ పెట్టుకోవడమో చేస్తుంటారు. ఇలాంటివి కొన్ని హత్యల వరకు వెళ్తుంటాయి. ఇప్పటి కాలంలో క్షణికావేశంలో మంచిచెడు ఏమీ ఆలోచించకుండా ప్రేమించిన వారికోసం ఏమైనా చేస్తున్నారు నేటి యువత. చేస్తున్నది తప్పా, ఒప్పా అన్నది పక్కనపెడితే కోపంలో హత్య చేసి చిన్న వయస్సులో హంతకులుగా మారుతున్నారు. ఇలాంటి ఘటనే మేడ్చల్​ జిల్లాలో జరిగింది. ప్రేమించిన యువతి తనని దూరం పెడుతూ తన స్నేహితుడితో చనువుగా ఉండడం చూసి తట్టుకోలేక కక్ష కట్టి హతమార్చిన ఉదంతమిది.

యువతి మాట్లాడడం చూసి తట్టుకోలేక : మేడ్చల్‌ జిల్లా కాప్రా ఎల్లారెడ్డిగూడలో నివసించే మహిపాల్‌ యాదవ్‌, అహ్మద్‌కూడ రాజీవ్‌ గృహకల్పకు చెందిన పృథ్వీరాజ్‌ స్నేహితులు. వీరి స్నేహంలో కుషాయిగూడకు చెందిన ఒక యువతి పరిచయమైంది. కొంతకాలం తర్వాత ఆమె పృథ్వీరాజ్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే ఈ విషయమై ఆ యువతి ఇంట్లో చెప్పగా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. తర్వాత ఆ యువతి పృథ్వీరాజ్‌ దూరం పెడుతూ వచ్చింది. ఈ క్రమంలో మహిపాల్‌ యాదవ్‌తో చనువుగా ఉంటోంది. అది చూసిన పృథ్వీరాజ్‌ ఓర్చుకోలేకపోయాడు. మహిపాల్‌పై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైన మహిపాల్‌ను హతమార్చి యువతిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.

రూ.1,000 కోసం స్నేహితుడి హత్య - శవాన్ని 3 భాగాలుగా నరికి మురుగు కాల్వలో

పక్కా ప్లాన్‌తో హత్య : మహిపాల్‌ను చంపేందుకు పక్కా ప్లాన్‌ రచించాడు. అందుకు ఈ నెల 10న ఇద్దరూ దమ్మాయిగూడలో మద్యం తాగారు. తర్వాత మహిపాల్‌ యాదవ్‌ను బైక్‌పై హరిదాస్‌పల్లి శివారులోని కొండపైకి తీసుకెళ్లాడు. బైక్‌ దిగమని చెప్పాడు. అక్కడ చుట్టుపక్కలా అంతా గమనించి తన వెంట తెచ్చుకున్న కత్తితో మహిపాల్‌ ఛాతిలో పొడిచాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అతన్ని వదిలేని అక్కడి నుంచి పరారయ్యాడు. ఉదయం స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారి విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం ఇంట్లో ఉన్న పృథ్వీరాజ్‌ను అదుపులోకి తీసుకుని తమదైన రీతిలో విచారించారు. దీంతో అతను చేసిన నేరం ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

'నా గర్ల్​ఫ్రెండ్ బర్గర్​ తింటావా?'- ఫ్రెండ్​ను కాల్చి చంపిన యువకుడు - Kills Friend For Burger Bite

'నాకు ఈతరాదు వదిలేయండన్నా ప్లీజ్​' - తాగిన మత్తులో స్విమ్మింగ్ పూల్‌లోకి యువకుడిని నెట్టేసిన సహోద్యోగులు - Birthday Party Death In Ghatkesar

ABOUT THE AUTHOR

...view details