తెలంగాణ

telangana

ETV Bharat / state

మీరు కార్లను అద్దెకు ఇస్తున్నారా? - తప్పకుండా ఈ కి'లేడీ' రూ.2.5 కోట్ల మోసం గురించి తెలుసుకోవాల్సిందే - SELF DRIVE CARS FRAUD CASE

యజమానుల నుంచి కార్లను తీసుకొని లక్షల్లో సొమ్ము చేసుకుంటున్న కిలాడి లేడీ - రూ.2.5 కోట్లు విలువ చేసే కార్లు స్వాధీనం - హైదరాబాద్​లోని గచ్చిబౌలిలో మోసం

Self Drive Cars Fraud
Self Drive Cars Fraud (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 3, 2024, 9:58 AM IST

Self Drive Cars Fraud:అనారోగ్యంతో భర్త మరణం. చికిత్స కోసం లక్షల్లో ఖర్చు. అప్పుల భారం ఆ మహిళలను పెడదారి పట్టించింది. సెల్ఫ్ డ్రైవ్​కు కార్ల ఇస్తే మంచి ఆదాయం ఇస్తమామని చెప్పి యజమానుల నుంచి కార్లు తీసుకుని వాటిని దారి మళ్లించి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్న కిలాడి లేడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమెకు సహకరించిన మరో ముగ్గరిని అరెస్ట్ చేసి వారి నుంచి 2.5కోట్లు విలువ చేసే కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్​లోని గచ్చిబౌలి టెలికం నగర్​లో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గచ్చిబౌలి టెలికం నగర్​కు చెందిన జూపూడి ఉష కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. కొన్నేళ్ల క్రితం ఆమె భర్త ఐఐటీ ఖరక్​పూర్​లో ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్​గా పని చేస్తున్న సమయంలో తేనెటీగలు కుట్టడంతో కోమాలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన చికిత్సకు సుమారు కోటి రూపాయలకు పైగా ఖర్చు పెట్టారు. అయినా తన భర్త బతకలేదు. దీంతో చికిత్స కోసం చేసిన అప్పులు తీర్చేందుకు తన వద్ద ఉన్న కారును సెల్ఫ్​ డ్రైవ్​కు ఇచ్చింది.

ఇదే సమయంలో ఆమెకు తుడుముల్ల మల్లేశ్​ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తన కారుతో కొంత ఆదాయం వస్తుండటంతో మల్లేశ్​ సహాయంతో మరిన్ని కార్లు సేకరించి సెల్ఫ్​ డ్రైవ్​కు ఇవ్వాలని భావించారు. పలువురు యజమానులకు కార్లు కావాలని, తమ మేడం రియల్​ ఎస్టేట్​ వ్యాపారంలో వినియోగించేందుకు కార్లు వినియోగిస్తామని వారి చెప్పారు. దీంతో మొత్తం 21 మంది తమ కార్లను సెల్ఫ్​ డ్రైవ్​ కోసం ఇచ్చారు. నెల నెలా రెంట్​ ఇస్తామని హామీ ఇవ్వడంతో కార్లను యజమానులు అప్పగించారు.

కార్లు తీసుకున్న ఉషా, మల్లేశ్​లు వాటిని కర్ణాటకలోని తమకు తెలిసిన సాగర్​ పాటిల్​, జమ్మె అనిల్​ కుమార్​లకు ఇచ్చారు. వారు ఈ కార్లకు ఉన్న నంబర్​ ప్లేట్లు, ఆర్సీలను మార్చి బీదర్​, బల్కి జిల్లాలతో పాటు మహారాష్ట్రలో వీటిని అద్దెలకు ఇచ్చారు. ఈ కార్ల దందాలో ఉషా నెలల్లోనే లక్షల్లో ఆదాయం వచ్చింది. ఏడు నెలల్లోనే 50 లక్షల వరకు సంపాదించింది. కొన్ని డబ్బులతో ఉషా అప్పులు తీర్చింది. కొంత డబ్బును మల్లేశ్​ ఇంటి నిర్మాణానికి ఇచ్చినట్లు సమాచారం.

21 కార్లు స్వాధీనం : ఇదే సమయంలో కార్ల యజమానులు రెంట్ల కోసం అడగటం ప్రారంభించడంతో సిమ్ కార్డులు, అడ్రస్​లు మారుస్తూ వచ్చారు. దీంతో రాయదుర్గంకి చెందిన గణేశ్​ అనే బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు,కేసును దర్యాప్తు చేసిన ప్రధాన నిందితులు ఉషా, మల్లేశ్​లను అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారంతో కర్ణాటక వెళ్లి సాగర్​, జమ్మె అనిల్​లను అరెస్టు చేసి మొత్తం 21 కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2.50 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఈ ఒక్క సూత్రం పాటించారంటే - మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయలేరు

షాపు యజమాని బంగారం శుద్ధి చేయమని పంపిస్తే - గుమాస్తా ఏం చేశాడో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details