తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం - యువకుడి ట్రాప్‌లో బాలిక - కట్​చేస్తే హోటల్​ గదిలో 20 రోజులుగా బందీ - Girl Captive in the Hotel Room - GIRL CAPTIVE IN THE HOTEL ROOM

Girl Captive in the Hotel Room : హైదరాబాద్​ నగరంలో దారుణం వెలుగు చూసింది. నిర్మల్‌ జిల్లా భైంసాకు చెందిన బాలికను నగరంలోని ఓ హోటల్‌ గదిలో 20 రోజులుగా ఓ యువకుడు బంధించాడు. సమాచారం తెలుసుకున్న షీ టీమ్‌ సిబ్బంది ఆదివారం సాయంత్రం బాలికను రక్షించారు. అనంతరం నిందితుడిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

Girl Captive in the Hotel Room at Hyderabad
Girl Captive in the Hotel Room (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 8, 2024, 9:57 PM IST

Young Man Trapped Minor Girl Through Instagram :ఇన్‌స్టాగ్రామ్‌​లో బాలికను ట్రాప్ చేసిన ఓ యువకుడు, లైంగిక దాడికి పాల్పడి మోసం చేశాడు. తీరా పెళ్లి పేరు ఎత్తగానే గదిలో ఆ అమ్మాయిని బంధించి ఉడాయించాడు. పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం, భైంసాకి చెందిన బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆ యువకుడు హైదరాబాద్​ నగరంలో సాఫ్ట్​వేర్ కోర్సు చేస్తున్నాడు. అతని ట్రాప్‌లో చిక్కుకున్న బాలికకు పెళ్లిపేరిట మాయామాటలు చెప్పి బలవంతంగా నగరానికి రప్పించాడు. అనంతరం నారాయణగూడలోని ఓ హోటల్‌ గదిలో 20 రోజులుగా నిర్బంధించి, లైంగిక వాంఛ తీర్చుకున్నాడు.

పెళ్లి చేసుకోవాలని బాలిక కోరడంతో హోటల్ రూమ్​కు తాళం వేసి, అక్కడ నుంచి యువకుడు పరారయ్యాడు. ఎట్టకేలకు బాలిక, తన ఫోన్‌ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అదించి, వాట్సాప్‌లో లోకేషన్‌ షేర్‌ చేసింది. దీంతో బాలిక తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్‌ చేరుకుని షీ టీమ్స్‌, నారాయణగూడ పోలీసులను ఆశ్రయించారు. నారాయణగూడలోని హోటల్‌లో బాధితురాలి లోకేషన్‌ గుర్తించిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాలికను కాపాడారు. ఆ అమ్మాయి ఫిర్యాదుతో యువకుడిని అరెస్ట్ చేసిన నారాయణ గూడ పోలీసులు, రిమాండ్​కు తరలించారు. నిందితుడిపై క్రిమనల్‌ కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details