Baby Boy Sale in Bapatla:నవ మోసాలు మోసి జన్మనిచ్చిన ఆ తల్లికి కడుపు తీపి గుర్తుకు రాలేదేమో! బుడి బుడి నడకల ఆ చిన్నారిని అమ్మేందుకు. పడ్డ పురిటి నొప్పులు మరిచి పేగు బంధాన్ని వదిలి పెట్టేసింది ఆ తల్లి. కష్టమే వచ్చిందనో, భారమని భావించిందో కాని డబ్బు కోసం ఆ చిన్నారిని వేరేవారికి అమ్మేసింది. చివరకు డబ్బుల విషయంలో తలెత్తిన గొడవ ఈ గుట్టును రట్టు చేసింది.
'రోజూ అల్లారు ముద్దుగా లాలిస్తే సంబరపోయా. చందమామ రావే, జాబిల్లి రావే అంటూ గోరు ముద్దలు తినిపిస్తే మురిసిపోయాను. నీ లాలి పాటలు వివి నీ ఒడిలో హాయిగా నిద్రపోయాను. అల్లారు ముద్దుగా ఆడిస్తూ మంచి దుస్తులు తొడిగితే మా అమ్మ ఎంతో మంచిదని సంబరపడిపోయా. అలా నన్ను విక్రయానికి పెడితే అమ్మే కదా వెంటనే వస్తుందిలే అని ఎదురుచూశా. ఎంత సేపటికీ నువ్వు రాకపోయేసరికి నాలో భయం మొదలైంది అమ్మా' అని ఆ మూడు నెల పసికందు బాధ గుండెలు బరువెక్కెలా చేసే ఈ ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది.
తాజాగా బాపట్లకు చెందిన వెంకటేశ్వరమ్మ మూడు నెలల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. తనకు శిశువు కావాలని మూడు వారాల క్రితం నెల్లూరు జిల్లా కావలికి చెందిన నాగమణి ఆమెను సంప్రదించింది. అందుకు లక్ష రూపాయలు ఇస్తానని బేరసారాలు జరిపింది. దీనికి సరేనన్న వెంకటేశ్వరమ్మ తన బిడ్డను నాగమణికి అప్పగించింది.