A Man Arrested for Trying to open The Doors of a Plane: విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనలు, మద్యం మత్తులో విమాన సిబ్బంది సహా తోటి ప్యాసింజర్లపై దాడుల ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువవుతున్నాయి. ఇంకొందరైతే మరో అడుగు ముందుకేసి గగనతలంలో ప్రయాణిస్తుండగా విమానం తలుపులను తెరిచే ప్రయత్నాలు చేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. తాజాగా హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఇలాగే చేసి కటకటాలపాలయ్యాడు. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శంషాబాద్ విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం
హైదరాబాద్ నగరంలోని గాజులరామారానికి చెందిన అనిల్ (35) అనే వ్యక్తి ఓ వ్యాయామశాలలో శిక్షకుడు (జిమ్ ట్రైనర్). అయితే ఇటీవల అతడు దైవదర్శనం కోసమని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినికి వెళ్లాడు. దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో విమానంలో బయలుదేరాడు. ఫ్లైట్ గగనతలంలో ప్రయాణిస్తుండగా, అనిల్ తన తోటి ప్రయాణికులతో కాస్త అనుచితంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన ఎయిర్లైన్స్ సిబ్బంది అతడిని అక్కడి నుంచి తీసుకొచ్చి, కాస్త మందలించి క్యాబిన్ వద్ద ముందు సీట్లో కూర్చోబెట్టారు.
విమానంలో ప్రయాణికుడు హల్చల్.. సీనియర్ అధికారిపై దాడి.. మెల్లగా మాట్లాడమన్నందుకే!