తెలంగాణ

telangana

ETV Bharat / state

డాన్​ అవుతానంటూ మిత్రుడి పాలిట 'విలన్​గా' మారిన యువకుడు - సినిమా కథకు తీసిపోదు! - Man Killed His Friend - MAN KILLED HIS FRIEND

Man Killed His Friend : సినిమాల్లో విలన్​ పాత్రల పట్ల ఇష్టం పెంచుకున్న ఓ యువకుడు, అతడి స్నేహితుడినే కత్తితో పొడిచి దారుణంగా చంపిన ఘటన బాలాపూర్​ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో నిందితుడితో పాటు అతడి మిత్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

Man Killed His Friend
Man Killed His Friend (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 24, 2024, 12:43 PM IST

Man Killed His Friend :నగరంలో డాన్​గా పేరు తెచ్చుకోవాలనుకున్న ఓ యువకుడు అతడి స్నేహితుడి పాలిట విలన్​గా మారి కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. ఈ దారుణ ఘటన బడంగ్​పేట కార్పొరేషన్​ పరిధి బాలాపూర్​లో జరిగింది. నిందితుడితో పాటు అతడి గ్యాంగ్​ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ జరిగింది :బడంగ్​పేట కార్పొరేషన్​ పరిధి బాలాపూర్​లో మాధవ్​ యాదవ్​ (21) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ప్రతి రోజూ సాయంత్రం స్థానిక ఇళ్లలో, వ్యాపార సముదాయాల్లోనూ పాలు విక్రయించేవాడు. సినిమాల్లో విలన్​ పాత్రలంటే ఇష్టం పెంచుకున్నాడు. ఆ ప్రభావంతో మరో ఆరుగురు గ్యాంగ్​ను పోషించే వాడు. వారిని నిత్యం వెంటబెట్టుకుని తిరిగేవాడు. నగరంలో డాన్​గా పేరుపొందాలని భావించేవాడు. దీనిలో భాగంగానే వారంరోజులుగా ఎవరినో ఒకరిని హతమార్చేందుకు అదను కోసం ఎదురుచూస్తున్నాడు. నాదర్​గుల్​లోని ఎంవీఎస్​ఆర్​ కళాశాలలో బీటెక్​ ద్వితీయ సంవత్సవం చదివే ప్రశాంత్​ స్థానికంగా ఉంటున్నాడు.

కత్తితో కడుపులో పొడిచి చంపి :మిత్రుడే అయినప్పటికీ వలసగా వచ్చిన వాడు కావటంతో అతడిని చంపాలని నిశ్చయించుకున్నాడు. ఈ నెల 22న పరిక్షలు రాసి తిరిగివచ్చిన అతనితో పాటే తన ఆరుగురు మిత్రులైన మహేష్‌ (22), సుమంత్‌ (21), హరీశ్ (20), అఖిల్‌ (21), యశ్వంత్‌(22), మహేశ్ అలియాస్‌ సన్ని(21)లతో కలిసి మాధవ్‌ ఓ ఫంక్షన్​కు వెళ్లి వచ్చాడు. బాగా మద్యం సేవించారు. తిరిగి వచ్చి స్థానిక మండీ హోటల్‌ పాన్‌షాపు వద్దకు చేరారు.

ప్రశాంత్‌కు ఉన్న ప్రేమ వ్యవహారాన్ని మనసులో పెట్టుకుని ఉన్నట్టుండి మాధవ్‌ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే మాటామాటా పెరగటంతో కత్తి తీసి ప్రశాంత్‌ కడుపులో నాలుగుసార్లు పొడవడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం మాధవ్, అతడి మిత్రులు పరారయ్యారు. మాధవ్‌తోపాటు ఆరుగురి గ్యాంగ్‌పై బాలాపూర్‌ పోలీసులు హత్య కేసును నమోదు చేశారు. తమ అదుపులో ఉన్న నిందితులను శనివారం రిమాండ్‌కు తరలిస్తామని బాలాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ భూపతి తెలిపారు.

ఇన్‌స్టాగ్రామ్‌ సాయంతో ఫ్రెండ్‌ను హత్య చేసిన స్నేహితుడు

ప్రేమకు అడ్డొస్తున్నాడని బీరు సీసాలతో దాడి చేసి స్నేహితుడి హత్య - నిందితులంతా 20 ఏళ్ల లోపువారే - friend Killed a friend

ABOUT THE AUTHOR

...view details