తెలంగాణ

telangana

ETV Bharat / state

అత్యంత వేడి సంవత్సరంగా 2024 - చరిత్రలోనే టాప్​ 5లో ఒకటి - 2024 IS THE HOTTEST YEAR

2024 Is The Hottest Year : 2024 సంవత్సరం చరిత్రలోనే తొలి ఐదు అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఈ విషయంపై క్లైమేట్​ ట్రెండ్స్​ సంస్థ వివరాలను వెల్లడిస్తూ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. ఇప్పుడు జరిగే సార్వత్రిక ఎన్నికలపై కూడా దీని ప్రభావం పడుతుందని అంచనా వేసింది.

Climate Changes Impact on Elections
Climate Changes Impact on Elections (etv bharat)

By ETV Bharat Telangana Team

Published : May 7, 2024, 11:47 AM IST

Climate Trends Report on Weather in 2024 Year : ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024వ సంవత్సరం చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు క్లైమేట్​ ట్రెండ్స్​ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఏప్రిల్​ నెలలో ముందస్తు రుతుపవనాల జల్లులు, ఉరుములతో కూడిన వర్షాలు లేకపోవడంతో భారత దక్షిణ ద్వీపకల్పంలో 1901 తరవాత ఐదో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైందని ఈ సంస్థ వెల్లడించింది.

సూపర్​ ఎల్​నినో ప్రభావంతో 2023 జూన్​ నుంచి 10 నెలలుగా ప్రతినెలా రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని తెలిపింది. కానీ ఏప్రిల్​ మాసం అత్యంత వేడి నెలగా రికార్డులకు ఎక్కిందని చెప్పింది. అలాగే భారత్​లో జరుగుతున్న అభ్యర్థుల ప్రచారం, ఓటింగ్​పై వాతావరణ మార్పుల ప్రభావం ఉందంది. అందుకే మరోసారి దేశంలో ఎన్నికలు నిర్వహించేందుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు అనుకూలిస్తాయా?అనే అంశంపై ఒక నివేదిక విడుదల చేసింది.

  • ఈ సంవత్సరం ప్రపంచంలోని 49 శాతం జనాభా 64 దేశాల్లో ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్​లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా 90 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు వేసేందుకు సంసిద్ధమయ్యారు.
  • సాధారణంగా ఏప్రిల్​ నుంచి జూన్​ వరకు 4-8 రోజులు వడగాలులు ఉంటాయి. ఈసారి అది 10 నుంచి 20 రోజులకు పెరిగింది. ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కేరళలో ఓటు వేసేందుకు వరుసల్లో నిల్చోవడంతో పది మంది ఎండదెబ్బకు మరణించారు. కేరళ విపత్తు నిర్వహణ అథారిటీ లెక్కల ప్రకారం ఏప్రిల్​ 22 నాటికి 413 వడదెబ్బ కేసులు నమోదయ్యాయి. ఒడిశాలో అయితే 124 కేసులు నమోదైతే ఒక మరణం సంభవించింది.
  • భారత వాతావరణ విభాగం అంచనాల ప్రకారం భారత ద్వీకల్పం మీదుగా యాంటీ సైక్లోన్ల వాతావరణం కారణంగా దేశంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడటం లేదు. దీంతో ఒడిశా, పశ్చిమబెంగాల్​ నుంచి సముద్రగాలులు తగ్గిపోయి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
  • దేశవ్యాప్తంగా ఇప్పటికే 20 శాతం ముందస్తు రుతుపవనాల వర్షపాతం లోటు నమోదైంది. మానవ తప్పిదాల కారణంగా వాతావరణంలో తీవ్ర మార్పులతో ఎల్​నినో మరింత బలంగా మారుతోంది. గతంలో ఎల్​నినో కారణంగా 2016 అత్యంత ఉష్ణ సంవత్సరంగా నమోదైంది. 2023లో సూపర్​ ఎల్​నినో కారణంగా ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.
  • దేశంలోని కోస్తా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలు దాటితే అత్యంత ప్రమాదంగా భావిస్తాం. ఈ తరహా ఉష్ణోగ్రతలు తీర ప్రాంతాలతో పాటు దేశంలోని అన్ని చోట్ల నమోదయ్యాయి. ఈ విషయంలో భారత తూర్పు తీర ప్రాంతం అత్యంత ప్రభావమైంది.
  • భారత వాతావరణ విభాగం అంచనాల ప్రకారం భారత ద్వీకల్పం మీదుగా యాంటీ సైక్లోన్ల వాతావరణం కారణంగా దేశంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడటం లేదు. దీంతో ఒడిశా, పశ్చిమబెంగాల్​ నుంచి సముద్ర గాలులు తగ్గిపోయి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
  • అమెరికాకు చెందిన క్లైమేట్​ సెంట్రల్​ సంస్థ వెల్లడించిన ప్రకారం ఎన్నికలు ప్రారంభమైన తరవాత ఏప్రిల్​లో భారత్​లోని 51 ప్రధాన నగరాలకుగాను 36 నగరాల్లో వరుసగా 3 అంతకన్నా ఎక్కువ రోజులు 37 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్​లో 3 రోజుల కన్నా ఎక్కువగా 18 నగరాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మాజీ ఎన్నికల కమిషనర్ల అభిప్రాయాలు :యాసంగిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్​, కమిషనర్లు నివేదికలో వారి అభిప్రాయాలు తెలియజేశారు. ప్రస్తుత ఎన్నికలను 2023 డిసెంబరు 17 నుంచి 2024 జూన్​ 16 వరకు ఎప్పుడైనా నిర్వహించవచ్చు. అయితే నవంబరు, డిసెంబరుల్లో కొన్ని రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికలు ఉండటంతో లోక్​సభ ఎన్నికలు రెండు నుంచి మూడు నెలలు ఆలస్యం అవుతున్నాయి. భవిష్యత్తులో అఖిలపక్ష భేటీ నిర్వహించి రాష్ట్రాల ఎన్నికలు రెండు నెలలు ఆలస్యం చేసి, లోక్​సభ ఎన్నికలు ఆ 6 నెలల కాలంలో నిర్వహించాలి.

2029లోనూ సాధారణ ఎన్నికలకు జనవరి 1 నుంచి జూన్​ 30 వరకు కాలపరిమితి ఉంటుంది. ఫిబ్రవరి, మార్చిలో ఎన్నికలు నిర్వహించేందుకు అనుకూలమైన సమయం ఉంది. లేదంటే రాష్ట్రాల ఎన్నికలు కొంత ముందు నిర్వహించేందుకు వీలుగా ఎన్నికల కమిషన్​కు అధికారాలు కల్పిస్తూ చట్టసవరణ చేయాలని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్​ ఓపీ రావత్​ తెలిపారు. దేశంలో ఎన్నికలను 180 రోజుల్లోగా ఎప్పుడైనా నిర్వహించే వెసులుబాటు ఈసీ ఉంది. వేసవి నేపథ్యంలో ఓటు వేసేందుకు వచ్చేవారి కోసం తాగునీరు, చల్లటి ప్రదేశాలు ఉండాలి. అయితే ప్రభుత్వ పదవీ కాలాన్ని దక్కించడానికి వీలులేదు. ఫిబ్రవరి-మార్చి నెలల్లో పరీక్షలు ఉంటాయి. అందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అకడమిక్​ క్యాలెండర్​ తప్పకూడదు. ఇందుకు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విశ్రాంత ఎన్నికల కమిషనర్​ అశోక్​ లావాస తెలిపారు.

భారత్​లో భిన్న వాతావరణ పరిస్థితులు - ఓచోట కరవు మరోచోట వరదలు - ఎందుకిలా?

'భవిష్యత్తులో వడగాలులు, వరదలు ఇంకా పెరుగుతాయి'

ABOUT THE AUTHOR

...view details