15 Municipal Councillors Moved to AP Camp : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పురపాలక పాలకవర్గంలో రాజకీయం వేడెక్కింది. రెండేళ్లుగా మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మెజారిటీ కౌన్సిలర్లు అవిశ్వాసం తీర్మానం ఇచ్చారు. ఈనెల 11న జిల్లా కలెక్టర్ ప్రియాంకకు 19 మంది కౌన్సిలర్లు సంతకాలతో కూడిన తీర్మానాన్ని అందజేశారు. వారి ఫిర్యాదును పరిశీలించిన జిల్లా కలెక్టర్ వచ్చే నెల ఫిబ్రవరి 5న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అవిశ్వాసం ప్రవేశపెట్టాలని నిర్ణయించడంతో పాటు కౌన్సిలర్లకు ఎందుకు సంబంధించిన నోటీసులను ఇల్లందు మున్సిపల్ కమిషనర్ ద్వారా అందజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న అవిశ్వాసాల జోరు - పీఠాన్ని కైవసం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు
Councillors Passed No-Confidence Motion On Collector Priyanka :గతంలో మున్సిపల్ ఛైర్మన్ డీవీపై అవిశ్వాసం ఆశించి క్యాంపునకు తరలిన కౌన్సిలర్లు అనంతరం నాలుగేళ్ల వరకు అవిశ్వాసం సమావేశం అవకాశం లేకుండా పోవడంతో అప్పటినుంచి మున్సిపల్ ఛైర్మన్‌తో విభేదిస్తూ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. జనవరి నాటికి నాలుగేళ్ల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో మరో 15 రోజుల్లో ఫిబ్రవరి 5న అవిశ్వాస సమావేశం అధికారులు నిర్ణయించడం వల్ల పట్టణంలో రాజకీయ సమీకరణాలపై ఉత్కంఠ నెలకొంది. గత మున్సిపల్ ఎన్నికల్లో 19 మందిలో బీఆర్ఎస్ నుంచి ముగ్గురు, సీపీఐ, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నుంచి ఒకరు గెలుపొందారు. కొన్ని రోజులకే ఇద్దరు సభ్యులు బీఆర్ఎస్లో చేరగా ఆ పార్టీ బలం 21కి చేరింది.
రాష్ట్రంలోని పలు పురపాలికల్లో.. అసమ్మతి రాగాలతో.. అవిశ్వాసబాట
No-Confidence Motion At Yellandu :మరోవైపు ఛైర్మన్‌తో విభేదాలతో ఉన్న మెజారిటీ కౌన్సిలర్లు ఈనెల 11వ తేదీన 19 మంది సంతకాలతో అవిశ్వాసం కోరుతూ జిల్లా కలెక్టర్‌కు నిబంధనల ప్రకారం వినతి పత్రం అందజేశారు. కాగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మున్సిపల్ ఛైర్మన్ డీవీ, నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరడంతో ఇల్లందులో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కోరం కనకయ్య గెలుపొందడం, సింగరేణి ఎన్నికల్లోను ఇల్లందులో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయుసీ విజయంలో వీరందరూ ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండడంతో ఇరు వర్గాల నాయకులు స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలుస్తూ వస్తున్నారు.