ETV Bharat / entertainment

'ఆయన్ను ఇబ్బంది పెట్టకండ్రా, ఇంకా టైమ్ ఉంది- థియేటర్లో అల్లాడిద్దాం'- OG మేకర్స్ - PAWAN KALYAN OG MOVIE

'పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఓపిక పట్టండి'- ఓజీ మేకర్స్ రిక్వెస్ట్

Pawan Kalyan OG Movie
Pawan Kalyan OG Movie (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 29, 2024, 9:16 AM IST

Updated : Dec 29, 2024, 9:43 AM IST

Pawan Kalyan OG Movie : పవర్ స్టార్ పవన్ కల్యాణ్- సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న 'ఓజీ' సినిమాపై అభిమానులకు రోజురోజుకు ఆత్రుత పెరిగిపోతుంది. ఇప్పిటికే రిలీజైన టీజర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసింది. దీంతో హీరో పవన్ కల్యాణ్ ఏ సభకు హాజరైనా, ఎక్కడ కనిపించినా ఫ్యాన్స్ 'ఓజీ', 'ఓజీ' అంటూ అరుస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ అభిమానులకు ఓ రిక్వెస్ట్ చేశారు. ఇంకొన్ని రోజులు ఓపిగ్గా ఉండాలని తెలిపారు. 'ఆయన్ని ఇబ్బంది పెట్టకండ్రా, ఇంకొంచెం టైమ్ ఉంది. అల్లాడిద్దాం థియేటర్లలో' అని ఫ్యాన్స్​కు ఫన్నీ రిక్వెస్ట్ చేసింది.

'OG సినిమాపై మీరు చూపిస్తున్న అభిమానం, ప్రేమ మా అదృష్టంగా భావిస్తున్నాము. ఓజీ సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి నిరంతరం పని చేస్తున్నాం. కానీ, మీరు పవన్ కల్యాన్ గారు పొలిటికల్ సభలకు వెళ్లినప్పుడు సమయం, సందర్భం చూడకుండా ఓజీ ఓజీ అని అరవడం, వారిని ఇబ్బంది పెట్టడం సరైంది కాదు. వారు ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా రాష్ట్ర భవిష్యత్ కోసం ఎంత కష్టపడుతున్నారో మనందరికీ తెలుసు. ఆ స్థానాన్ని, స్థాయిని గౌరవించడం మన కనీస బాధ్యత. అందుకని ఇంకొన్ని రోజులు ఓపికగా ఉందాం. 2025 -OG పండుగ వైభవంగా నిలుస్తుందని మేము గట్టిగా నమ్మకతున్నాం' అని నిర్మాణ సంస్థ డివివి దానయ్య ఎంటర్టైన్మెంట్ పోస్ట్ షేర్ చేసింది.

ఇదీ జరిగింది
పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఇటీవల ఓ మీడియాతో సీరియస్​గా మాట్లాడుతుండగా అక్కడే ఉన్న ఫ్యాన్స్ ఓజీ ఓజీ అని అరిచారు. అభిమానుల స్లోగన్స్​తో అసహనానికి గురైన పవన్ 'ఆగండయ్యా. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు' అని అన్నారు. ఈ క్రమంలోనే మేకర్స్ ఈ విధంగా ఫ్యాన్స్​కు సర్ది చెప్పారు.

కాగా, ఈ సినిమా గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో పవన్‌ కల్యాణ్ 'ఓజాస్‌ గంభీర' అనే పవర్​ ఫుల్​ పాత్రలో కనిపించనున్నారు. ఆయన్ని ఢీకొట్టే ప్రతినాయకుడిగానే బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్‌ నటిస్తున్నారు. బ్యూటీ ప్రియాంకా మోహన్‌ హీరోయిన్​గా నటిస్తుండగా, శ్రియా రెడ్డి కీలక పాత్ర పోషిస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య దీనిని నిర్మిస్తున్నారు. 2025 ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.

OG స్పెషల్ సాంగ్- పవర్​స్టార్​తో స్టెప్పులేయనున్న 'రాధిక'!

'బ్లాస్ట్ ది హెలికాప్టర్!' - పవన్ కల్యాణ్ OG లేటెస్ట్ అప్డేట్ ఇదే!

Last Updated : Dec 29, 2024, 9:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.