తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కపిల్ దేవ్​ను కాల్చేద్దామని ఫిక్స్ అయ్యా- పిస్తోల్​తో వాళ్లింటికి కూడా వెళ్లా' - YOGRAJ ON KAPIL DEV

కపిల్ దేవ్​పై యోగ్​రాజ్ షాకింగ్ కామెంట్స్- ఏకంగా చంపేద్దాముకున్నాడట!

Yograj On Kapil Dev
Yograj On Kapil Dev (Source : Getty Images, ANI)

By ETV Bharat Sports Team

Published : Jan 12, 2025, 7:06 PM IST

Yograj On Kapil Dev :టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్​రాజ్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటాడు. గతంలో క్రికెట్ దిగ్గజం కపిల్​ దేవ్​ను చంపేందుకు పిస్తోల్​తో తన ఇంటికెళ్లిన సందర్భాన్ని తాజాగా గుర్తు చేసుకున్నాడు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన యోగ్​రాజ్ ఈ విషయం బయటపెట్టాడు.

తనను జట్టులోంచి తప్పించినందుకు కపిల్ దేవ్​ను యోగ్​రాజ్ చంపాలనుకున్నాడట. అంతేకాదు పిస్తోల్​తో కపిల్ దేవ్ ఇంటికెళ్లాడట. 'కపిల్ దేవ్ టీమ్ఇండియా కెప్టెన్ అయ్యాక, ఎలాంటి కారణం లేకుండా నన్ను జట్టు నుంచి తప్పించాడు. దీంతో నా భార్య, కపిల్​ను ఈ విషయంపై ప్రశ్నించాలని అనుకుంది. కానీ నేనే కపిల్​కు బుద్ధి చెప్పి వస్తానని ఆమెతో చెప్పి, నా పిస్తోల్​ తీసుకుని కపిల్ దేవ్ ఇంటికెళ్లా. అతడు వాళ్ల అమ్మ, సోదరుడితో కలిసి బయటకు వచ్చాడు. ఇష్టం వచ్చినట్లు తిట్టేశా. 'నీ కారణంగా నేను క్రికెట్ కోల్పోయాను. నీ తలలో బుల్లెట్ పేల్చాలని ఉంది. కానీ, అలా చేయను. ఎందుకంటే నీకు ఓ తల్లి ఉంది' అని అతడితో చెప్పి తిరిగి వచ్చేశా. ఇక జీవితంలో క్రికెట్ ఆడకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను' అని యోగ్​రాజ్ పేర్కొన్నాడు.

అప్పుడు మెసేజ్ చేశా
కాగా, టీమ్ఇండియా 2011లో వన్డే వరల్డ్​కప్ నెగ్గిన తర్వాత తాను కపిల్​కు మెసేజ్ చేసినట్లు చెప్పాడు. 'భారత్​ 2011లో వరల్డ్​కప్​ విజయం సాధించినప్పుడు, ఏడ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కపిల్ మాత్రమే. అతడికి నేను పేపర్ క్లిప్​ కటింగ్​ పంపించి, 'నీ కన్నా నా కుమారుడు వరల్డ్​కప్​లో అద్భుతంగా ఆడాడు' అని చెప్పా. దానికి కపిల్ రిప్లై కూడా ఇచ్చాడు. 'వచ్చే జన్మలో ఇద్దరం అన్నదమ్ములుగా, ఒకే తల్లి కడుపులో జన్మిద్దాం' అని కపిల్ అన్నట్లు యోగ్​రాజ్ పేర్కొన్నాడు.

కాగా, ఇదే ఇంటర్వ్యూలో యోగ్​రాజ్ ధోనీ గురించి కూడా మాట్లాడాడు. అయితే ఎప్పుడూ ధోనీని విమర్శించే యోగ్​రాజ్ ఈసారి మాత్రం పొగిడాడు. అతడు మంచి కెప్టెన్, అద్భుతమైన ప్లేయర్ అంటూ ధోనీపై ప్రశంసలు కురిపించాడు.

యువరాజ్ సింగ్ తండ్రి యూ టర్న్- 'ధోనీ'యే తోప్ కెప్టెన్ అంట!

'రోహిత్, కోహ్లీ ఎంత తోపులైనా- వారికి చెప్పాల్సిన బాధ్యత కోచ్​దే!'

ABOUT THE AUTHOR

...view details