Yashasvi jaiswal Manoj sharma:టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ కెరీల్లో తొలి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. విశాఖపట్టణం వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో జైశ్వాల్ ఈ ఫీట్ అందుకున్నాడు. దీంతో జైశ్వాల్ టీమ్ఇండియాలో అతి చిన్న వయసులో టెస్టు డబుల్ సెంచరీ సాధించిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు. దీంతో క్రీడావర్గాల్లో ప్రస్తుతం జైశ్వాల్ పేరు మార్మోగిపోతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ జైశ్వాల్ పేరు ట్రెండింగ్‌లో ఉంది.
అయితే రీసెంట్ బ్లాక్‌బస్టర్ 12th ఫెయిల్ సినిమా హీరో మనోజ్ శర్మ క్యారెక్టర్‌తో జైశ్వాల్ కెరీర్ జర్నీని పోలుస్తూ నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. 'యశస్వి జైశ్వాల్ క్రికెట్ వెర్షన్ ఆఫ్ మనోజ్ శర్మ' అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే జైశ్వాల్ కూడా కెరీర్ ప్రారంభంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఇదివరకే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లో జన్మించిన జైశ్వాల్, కెరీర్లో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నట్లు చెప్పాడు. దీంతో అతడి లైఫ్ కూడా మనోజ్ శర్మలాగే సాగిందని నెటిజన్లు అంటున్నారు.
ఏంటీ 12th ఫెయిల్ సినిమా? మనోజ్ శర్మ అనే ఐపీఎస్ అధికారి రియల్ లైఫ్ స్టోరీతో తెరకెక్కిన సినిమాయే '12th ఫెయిల్'. మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలో జన్మించిన మనోజ్ కుమార్ శర్మ 12వ తరగతి ఫెయిలైనప్పటికీ, ఐపీఎస్ ఉద్యోగం ఎలా సంపాదించారు? ఈ జర్నీలో ఆయనుకు ఎదురైన కష్టాలేంటి? వాటిన్నంటిని ఎలా ఎదుర్కొన్నారు. ఎలా సక్సెస్ సాధించారు? అనే అంశాల్ని సినిమాలో చూపించారు. అయితే ప్రస్తుతం జైశ్వాల్ కూడా అలాగే కెరీర్లో ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడు సక్సెస్ అందుకున్నాడని అంటున్నారు.