తెలంగాణ

telangana

ETV Bharat / sports

WPL 2024 ట్రోఫీ విన్నర్ ఆర్సీబీ ప్రైజ్​మనీ ఎన్ని కోట్లంటే? - WPL 2024 RCB Trophy Prize Money

WPL 2024 RCB Trophy Prize Money : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 ఫైనల్ ఆదివారం (మార్చి 17) జరిగిందన్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక పోరులో దిల్లీ క్యాపిటల్స్​పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. తొలిసారి ఆర్సీభీ ట్రోఫీని ముద్దాడింది. దీంతో ఆర్సీబీ క్యాంప్​తో పాటు అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి ఈ రెండో సీజన్​లో విజేతగా నిలిచిన ఆర్సీబీకి ప్రైజ్ మనీ ఎంత? రన్నరప్​గా నిలిచిన దిల్లీ క్యాపిటల్స్​ ఎంత మొత్తం అందుకుంది? వంటి విషయాలను తెలుసుకుందాం.

WPL 2024 ట్రోఫీ విన్నర్ ఆర్సీబీ ప్రైజ్​మనీ ఎన్ని కోట్లంటే?
WPL 2024 ట్రోఫీ విన్నర్ ఆర్సీబీ ప్రైజ్​మనీ ఎన్ని కోట్లంటే?

By ETV Bharat Telugu Team

Published : Mar 18, 2024, 7:37 AM IST

WPL 2024 RCB Trophy Prize Money :ఐపీఎల్‌లో ప్రతీ ఏటా నిరాశ ఎదురవుతున్నప్పటికీ, ఆత్మవిశ్వాసంతోనే బరిలోకి దిగే జట్టు ఆర్సీబీ. ఆ జట్టుకు ఇన్నేళ్లపాటు ట్రోఫీ అందని ద్రాక్షగా మిగిలిపోయింది. అయితే ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించింది. ఐపీఎల్‌లో కాకపోయినా మహిళల జట్టు డబ్ల్యూపీఎల్‌ 2024 సీజన్​లో ఆర్సీబీ విజేతగా నిలిచింది. స్మృతి మంధాన నేతృత్వంలోని బెంగళూరు జట్టు ఫైనల్​లో దిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి కప్పును దక్కించుకుంది. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

ఆదివారం జరిగిన ఫైనల్​లో బెంగళూరు 8 వికెట్ల తేడాతో గెలిచింది. సోఫీ మోలనూ (3/20), శ్రేయాంక పాటిల్‌ (4/12), ఆశా శోభన (2/14) అదిరే బౌలింగ్​కు దిల్లీ క్యాపిటల్స్​ 18.3 ఓవర్లలోనే 113 పరుగులకు ఆలౌట్ అయిపోయింది. షెఫాలి వర్మ (27 బంతుల్లో 44; 2×4, 3×6) టాప్‌ స్కోరర్​గా నిలిచింది. ఎలీస్‌ పెర్రీ (37 బంతుల్లో 35 నాటౌట్‌; 4×4), సోఫీ డివైన్‌ ( 27 బంతుల్లో 32; 5×4, 1×6), స్మృతి మంధాన (39 బంతుల్లో 31; 3×4) మంచిగా రాణించడం వల్ల బెంగళూరు లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అలా ఆర్సీబీ విజయం సాధించింది.

అయితే ఈ ఫైనల్​లో గెలిచిన ఆర్సీబీ జట్టుకు రూ.6 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. ఇక రన్నరప్​గా నిలిచిన దిల్లీ క్యాపిటల్స్​ జట్టుకు రూ.3 కోట్లు అందుకుంది. వాస్తవానికి ఈ ఏడాది ఈ రెండు జట్లు కూడా మంచి పోటినిచ్చాయి. దిల్లీ మొదటి నుంచి ఫామ్​లో ఉన్నప్పటికీ ఆర్సీబీ మాత్రం కాస్త ఒడుదొడుకులను ఎదుర్కొంటూ ఫైనల్ చేరి గెలుపొందింది.

IPL Prize Money : ఇకపోతే ఐపీఎల్ 2008 సీజన్ నుంచి కొనసాగుతోంది. ఇప్పటి వరకు 16 సీజన్లను కంప్లీట్ చేసుకుంది. ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్ అవ్వడంతో ఈ మెగా లీగ్ ప్రైజ్ మనీ కూడా ఎక్కువే. 2020 వరకు రూ.10 కోట్లు ఉండేది. 2021 నుంచి రెట్టింపు చేసి రూ.20 కోట్లకు పెంచారు. రన్నరప్ జట్టుకు రూ.13 కోట్లు ఇస్తున్నారు.

WPL 2024 బెంగళూరు భళా - ఇక మిగిలింది IPL ట్రోఫీ మాత్రమే!

ఫైనల్స్​లో ఆర్సీబీ ఘన విజయం - 'ఈ సాలా కప్ నమ్​దే'

ABOUT THE AUTHOR

...view details