ETV Bharat / state

హైదరాబాద్‌లో నేడు 'ఉచిత రవాణా సౌకర్యం' - పూర్తి వివరాలివిగో - FREE TRAVEL FACILITY ON DEC 31ST

నూతన సంవత్సరం సందర్భంగా నేడు హైదరాబాద్‌తో పాటు ఆయా ప్రాంతాల్లో ఉచిత రవాణా సౌకర్యం - 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలతో ఉచిత ప్రయాణ సౌకర్యం

FREE TRAVEL FACILITY Today
Today Free transport services (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 30, 2024, 6:56 PM IST

Updated : Dec 31, 2024, 9:09 AM IST

Free Transport services on December 31st in Hyderabad : నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు రాత్రి హైదరాబాద్‌తో పాటు ఆయా ప్రాంతాల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ మేరకు హైదరాబాద్​తో పాటు సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఉచిత రవాణా సౌకర్యం ఉంటుందని తెలిపింది. మీడియాతో సమావేశమైన తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ సభ్యులు, నగరంలో ఈ రోజు రాత్రి ఉచిత రవాణా సౌకర్యం ఉంటుందని తెలిపారు.

ఉచిత రవాణా సౌకర్యం : ఈ సందర్భంగా 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయని తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ సభ్యులు వివరించారు. ప్రజలు మద్యం మత్తులో వాహనాలు నడపకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు జరగకూడదని ఫోర్‌ వీలర్స్‌ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

మెట్రో సేవలు పొడిగింపు : కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణం కల్పించేందుకు హైదరాబాద్ మెట్రో రైలు ఈరోజు రాత్రి మెట్రో సేవలను పొడిగించింది. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ఈ సేవలు అందిస్తున్నట్లు తెలిపింది. ఈ రోజు చివరి రైలు అన్ని టెర్మినల్ స్టేషన్‌ల నుంచి అర్ధరాత్రి 12:30 గంటలకు బయలుదేరి దాదాపు 1:15 గంటలకు సంబంధిత ఎండ్ పాయింట్‌లకు చేరుతాయని హెచ్ఎమ్ఆర్ఎల్ ఎండీ ఎన్​వీఎస్​ రెడ్డి రెడ్డి తెలిపారు. ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణం అందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు.

New year celebrations 2025 : న్యూ ఇయర్ సమయంలో మెట్రో ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఎన్​వీఎస్​ రెడ్డి చెప్పారు. మద్యం సేవించి వచ్చినా, తోటి ప్రయాణికుల పట్ల దుర్భాషలాడిన మెట్రో రైలు భద్రతా సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా బాధ్యతాయుతంగా మెట్రో రైళ్లలో ప్రయాణించాలని ఆయన ప్రయాణికులను కోరారు. నూతన సంవత్సర వేడుకల్లో యువత మద్యం సేవించి వాహనాలను నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అన్నారు.

న్యూ ఇయర్ రోజు పార్టీ చేసుకుంటున్నారా​ - అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే

హైదరాబాద్​లో న్యూ ఇయర్​ సెలబ్రేషన్స్​ - ప్రత్యేక ఆకర్షణగా సినీ తారలు, డీజేలు

Last Updated : Dec 31, 2024, 9:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.