ETV Bharat / state

'మా నాన్న భూ వివాదం పరిష్కరించండి'- కలెక్టర్​కు ఇద్దరు చిన్నారుల విజ్ఞప్తి - TWO CHILD COMPLAINT TO COLLECTOR

తమ తండ్రి భూ వివాదం పరిష్కరించాలంటూ కలెక్టర్‌ను కలిసిన ఇద్దరు చిన్నారులు - న్యాయం కోసం వచ్చిన పిల్లలను చూసి ఆశ్చర్యపోయిన అధికారులు - జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘటన

TWO CHILD COMPLAINT TO COLLECTOR
Two School Child Complaint to Collector on Land Issue (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 30, 2024, 6:37 PM IST

Two School Child Complaint to Collector on Land Issue : ఇంట్లో ఉత్సాహంగా ఉంటూ ఇంటి పనులు చేసే పిల్లలను చూశాం కానీ ఇంటివాళ్ల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన చిన్నారులను చూశారా ? భూ వివాదం సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఇద్దరు గురుకుల విద్యార్థులు జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. జిల్లాలోని ఎండ్లపల్లి మండలం చర్లపల్లికి చెందిన బండి శ్రీవాత్సవ్‌, అతని చెల్లి వైష్ణవి జగిత్యాలలోని గురుకుల పాఠశాలలో చదువుతున్నారు. సెలవులకు ఇంటికి వెళ్లిన చిన్నారులు పాఠశాలకు వెళుతున్నామని ఇంట్లో చెప్పి బస్సు ఎక్కి జగిత్యాల ప్రజావాణికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ సత్యప్రసాద్‌ను కలిసి తమ తండ్రికి జరుగుతున్న అన్యాయన్ని పరిష్కరించాలని వేడుకున్నారు.

తమ తాత మల్లయ్యకు 7 ఎకరాల భూమి ఉందని కానీ తమ చిన్ననాన్న 5 ఎకరాల 18 గుంటల భూమి తమ తండ్రి తిరుపతికి తెలియకుండానే పట్టా చేసుకున్నారని.. తమకు న్యాయం చేయాలంటూ ఇద్దరు చిన్నారులు జిల్లా కలెక్టర్‌ను వేడుకున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారుల ఫిర్యాదుకు స్పందించిన జిల్లా కలెక్టర్‌ విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. తండ్రికి జరిగిన అన్యాయంపై పిల్లలు న్యాయం కోసం ప్రజావాణికి రావటం చూసిన అధికారులు ఆశ్చర్యపోయారు. అయితే ఇదే విషయం తల్లిదండ్రులు శ్రీలత, తిరుపతిని అడిగితే తమకు తెలియకుండానే వచ్చారని, తమకు అన్యాయం జరిగింది వాస్తమేనని తెలిపారు.

'నా నాన్నకు, బాబాయికి గొడవ. మాతాత సింగరేణిలో పని చేసి రిటైర్​ అయ్యారు. ఆయన 2013లో మృతి చెందారు. మా తాత పేరు మీద రూ.18 లక్షలు వచ్చాయంటూ మా బాబాయి అంటున్నారు. రికార్డులో చూస్తే రూ. 12 లక్షలు మాత్రమే వచ్చినట్లు ఉంది. మిగతా డబ్బులు తీసుకున్నావని, అందుకే భూమి పట్టా చేసుకున్నానని బాబాయి మా తండ్రిని బెదిరిస్తున్నారు. ఈ విషయంపై పోలీస్​స్టేషన్​లో మా నాన్న కేసు పెట్టగా మమ్మల్నే కొట్టి బెదిరించారు. భూమి నాదంటూ మా బాబాయి గొడవ పడుతున్నారు. దీంతో మాకు న్యాయం చేయాలంటూ కలెక్టర్‌ను కలిసి మా సమస్యలను వివరించాం'- శ్రీవాత్సవ్‌, విద్యార్థి

'అన్నం అడిగితే అమ్మ కొడుతోంది సార్​'.. బాలుడి ఫిర్యాదు.. పోలీసులు ఏం చేశారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.