World Chess Championship : ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ క్లైమాక్స్ రసవత్తరంగా మారింది. 14 గేమ్‌లు ఉండే ఈ ప్రపంచ మ్యాచ్‌లో 12 గేమ్‌లు పూర్తయ్యేసరికి భారత యువ సంచలనం గుకేశ్, డింగ్ లిరెన్ 6-6తో సమంగా నిలిచారు. ఇక బుధవారం జరిగిన 13వ గేమ్ డ్రాగా ముగిసింది.
ఈ 13వే గేమ్‌లో 69 ఎత్తుల తర్వాత ఇద్దరు ఆటగాళ్లు డ్రాకు అంగీకరించారు. దీంతో ప్రస్తుతం ఇద్దరు ప్లేయర్స్ 6.5 - 6.5 పాయింట్లతో సమానంగా నిలిచారు. ఇక గురువారం జరిగే చివరి (14వ) గేమ్‌లో ఏ ప్లేయర్ అయితే గెలుస్తారో, వారే ఛాంపియన్‌గా అవతరిస్తారు. ఒకవేళ ఆఖరి గేమ్ కూడా డ్రా ముగిస్తే, ఇద్దరు ప్లేయర్లు ఏడేసి పాయింట్లతో సమానంగా నిలుస్తారు. అప్పుడు శుక్రవారం టై బ్రేక్‌లో విజేతను నిర్ణయించాల్సి వస్తుంది.