Women Asian Champions Trophy 2024 : మహిళల ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో భారత్ ఫైనల్‌కు అర్హత సాధించింది. బిహార్‌లోని రాజ్‌గిర్ వేదికగా జరిగిన సెమీపైనల్‌లో విజయం సాధించింది. జపాన్‌తో 2-0 తేడాతో గెలుపొందింది. కాగా, లీగ్ దశలో వరుస విజయాలతో అజేయంగా ముందుకు సాగిన సలీమా టీమ్ సెమీ ఫైనల్‌లోనూ అదే దూకుడు కనబరిచి తుది పోరుకు దూసుకెళ్లింది.
ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ - ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్
మహిళల ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో ఫైనల్‌కు అర్హత సాధించిన భారత్.
Published : 4 hours ago
తొలి 3 క్వార్టర్స్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ నువ్వా నేనా అనేలా సాగింది. ఇరు జట్లు కూడా ఒక్క గోల్ కూడా చేయలేదు. అయితే, ఉత్కంఠగా సాగిన ఈ నాలుగో క్వార్టర్‌లో ఒత్తిడిని చిత్తు చేస్తూ భారత్ మహిళల టీమ్ 2 గోల్స్ సాధించింది. ఇండియన్ వైస్ కెప్టెన్ నవీనీత్ కౌర్ మొదటి గోల్ చేయగా, లాల్‌రెమ్సియామి రెండో గోల్ బాదింది.
మరోవైపు చైనా, మలేసియా టీమ్స్ మధ్య జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో 3-1 తేడాతో డ్రాగన్ జట్టు జయకేతనం ఎగురవేసింది. దీంతో బుధవారం జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో చైనా, భారత్ జట్లు తలపడనున్నాయి.