Where To Watch IND vs BAN First T20, Worldcup 2024 IND VS PAK : ఈ ఆదివారం అక్టోబర్ 6 భారత క్రికెట్ అభిమానులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ లభించనుంది. ఎందుకంటే ఈ ఒక్క రోజే భారత అమ్మాయిలు టీ20 వరల్డ్ కప్లో భాగంగా పాకిస్థాన్ జట్టుతో తలపడనుండగా, మరోవైపు ఇదే రోజు భారత పురుషుల జట్టు - బంగ్లాదేశ్తో మూడు మ్యాచుల సిరీస్లో భాగంగా తొలి టీ20లో పోటీపడనున్నాయి. ఈ సందర్భంగా ఈ మ్యాచ్లను ఫ్రీ ఎక్కడ చూడొచ్చు, లైవ్ స్ట్రీమింగ్ ఎందులో అవుతుంది? ఇంకా మ్యాచ్కు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకుందాం.
IND vs BAN First T20 :భారత్, బంగ్లాదేశ్ మధ్య అక్టోబరు 6 నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 6న జరిగే తొలి టీ20కు గ్వాలియర్, 9న జరిగే రెండో టీ20కు దిల్లీ ఆతిథ్యమివ్వనుండగా, మూడో టీ20 హైదరాబాద్ వేదికగా అక్టోబర్ 12న జరగనుంది.
తొలి టీ 20 మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ వేదికగా శ్రీమంత్ మాధవ్రావ్ సిండియా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేదిక తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తోంది. 2010 తర్వాత మధ్యప్రదేశ్లో టీమ్ ఇండియా ఆడుతున్న తొలి మ్యాచ్ కూడా ఇదే. అలానే 2019 నవంబర్ తర్వాత భారత్ బంగ్లాదేశ్ తొలిసారి టీ20 సిరీస్లో తలపడుతున్నారు.
చివరి సారిగా 2024 టీ20 వరల్డ్ కప్లో భారత్ - బంగ్లా తలపడ్డారు. అప్పుడు భారత్ 50 పరుగులు తేడాతో బంగ్లాను ఓడించింది. మొత్తంగా భారత్ - బంగ్లా 14 టీ20ల్లో తలపడగా, అందులో భారత్ 13 గెలవగా, ఒక మ్యాచ్లో ఓడిపోయింది.