తెలంగాణ

telangana

ETV Bharat / sports

పోరాటంలో మానసిక ఒత్తిడి ఎక్కువైంది - రెజ్లింగ్​కు తిరిగి రాలేను : సాక్షి మాలిక్​

WFI Protest Sakhi Malik : గతేడాది రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్​ మరోసారి ఆటలోకి తిరిగి రానని నొక్కి చెప్పింది. ఏడాది నుంచి చేస్తున్న నిరసనల వల్ల తనపై మానసిక ఒత్తిడి ఎక్కువైపోయిందని పేర్కొంది.

Etv పోరాటంలో మానసిక ఒత్తిడి ఎక్కువైంది - రెజ్లింగ్​కు తిరిగి రాలేను : సాక్షి మాలిక్​
పోరాటంలో మానసిక ఒత్తిడి ఎక్కువైంది - రెజ్లింగ్​కు తిరిగి రాలేను : సాక్షి మాలిక్​

By ETV Bharat Telugu Team

Published : Mar 4, 2024, 6:45 PM IST

Updated : Mar 4, 2024, 9:12 PM IST

WFI Protest Sakhi Malik : భారత స్టార్ రెజ్లర్, ఒలింపిక్ బ్రాంజ్​ మెడల్ గ్రహీత సాక్షి మాలిక్ గతేడాది రెజ్లింగ్ ఆటకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే ఈమె మళ్లీ పోటీల్లో తిరిగి పాల్గొనాలని చాలా మంది కోరారు. అయితే దీనిపై ఆమె మరోసారి స్పందించింది. తాను తిరిగి పోటీల్లో పాల్గొనలేనని చెప్పింది. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా సుదీర్ఘ కాలంగా చేస్తున్న పోరాటంలో తాను మానసిక ఒత్తిడికి బాగా గురైనట్లు తెలిపింది.

"ఈ పోరాటం మొదలై దాదాపుగా ఏడాది దాటిపోయింది. దీంతో నాకు మెంటల్ ప్రెజర్ ఎక్కువైపోయింది. ఈ పోరాటం విజయం సాధించాలని అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి నేను రెజ్లింగ్​ను కొనసాగించలేను. ఒలింపిక్స్​లో నాకు బ్రాంజ్ మెడల్ వచ్చింది. నా జూనియర్స్​కు స్వర్ణం, రజతం రావాలని కోరుకుంటున్నాను. దేశంలోని ప్రతి ఆడపిల్ల తమ కలలను నేరవేర్చుకునేందుకు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను" అని మీటూ ఉద్యమ ప్రభావంపై జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో సాక్షి మాలిక్‌ ఈ వ్యాఖ్యలను పేర్కొంది. రెజ్లింగ్​లో తిరిగి రావాలని ఎంతోమంది విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ బ్రిజ్‌ భూషణ్‌ వంటి వాళ్ల మధ్య రెజ్లింగ్‌ను కొనసాగించలేనని, అది కష్టమని చెప్పింది.

కాగా, భారత రెజ్లింగ్‌ సమాఖ్య(WFI) అధ్యక్ష పదవి నుంచి బ్రిజ్‌ భూషణ్‌సింగ్‌ను తొలగించాలంటూ, అలాగే ఆయన్ను అరెస్టు చేయాలంటూ ఏడాది క్రితం నిరసనలను ప్రారంభించారు స్టార్ల్ రెజర్లు. అనుకున్నట్టే తమ నిరసనల ద్వారా బ్రిజ్ భూషన్​ను అధ్యక్ష పదవి నుంచి తొలిగేంచేలా చేశారు. అయితే అతడిని అరెస్ట్ చేసే డిమాండ్ మాత్రం తీరలేదు. అప్పటి నుంచి సాక్షి మాలిక్‌తో సహా బజరంగ్‌ పునియా, వినేశ్‌ ఫోగట్‌లు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే డబ్ల్యూఎఫ్‌ఐ కొత్త అధ్యక్షుడిగా సంజయ్‌ సింగ్‌ ఎన్నికయ్యారు. దీన్ని నిరసిస్తూ గతేడాది డిసెంబర్‌లో సాక్షి మాలిక్‌ రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది.

ధోని కెప్టెన్సీ వదిలేస్తున్నాడా? న్యూ రోల్‌ అంటూ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌

WPL 2024 - ప్లేఆఫ్స్‌ ఆవకాశాలు ఏ జట్టుకు ఎలా ఉన్నాయంటే?

Last Updated : Mar 4, 2024, 9:12 PM IST

ABOUT THE AUTHOR

...view details