తెలంగాణ

telangana

ETV Bharat / sports

డబ్ల్యూఎఫ్​ఐ పై సస్పెన్షన్​ ఎత్తివేత - యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ కీలక నిర్ణయం

WFI Ban Uplift : భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై సస్పెన్షన్‌ను యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ తాజాగా ఎత్తివేసింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందంటూ ఓ ప్రకటనలో పేర్కొంది.

By ETV Bharat Telugu Team

Published : Feb 13, 2024, 9:08 PM IST

Updated : Feb 13, 2024, 10:07 PM IST

WFI Ban Uplift
WFI Ban Uplift

WFI Ban Uplift : భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై విధించిన సస్పెన్షన్​ను ఎత్తివేసినట్లు యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ సంస్థ తాజాగా వెల్లడించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందంటూ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇటీవలే యూడబ్ల్యూడబ్ల్యూ బ్యూరో సమావేశమైంది. అందులో భాగంగా రెజ్లింగ్ సమఖ్యపై విధించిన సస్పెన్షన్, ఇతర విషయాలపై చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో ఈ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు అని యూడబ్ల్యూడబ్ల్యూ తెలిపింది. పలు షరతులతోనే ఈ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్టు పేర్కొంది.

" రెజ్లింగ్ సమాఖ్య అథ్లెట్ల కమిషన్‌కు ఎన్నికలు నిర్వహించాలి. ఇందులో పాల్గొనే అభ్యర్థులు క్రియాశీలక అథ్లెట్లు లేదా ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి నాలుగేళ్లకు మించినవారు అయ్యుందాలి. అంతే కాకుండా ఇందులో అథ్లెట్లే ఓటర్లుగా ఉండాలి. ఈ ఎన్నికలు ట్రయల్స్ సమయంలో లేదా ఏదైనా సీనియర్ జాతీయ ఛాంపియన్‌షిప్ జరిగేటప్పుడు మాత్రమే నిర్వహించాలి. జూలై 1 కంటే ముందుగానే ఈ ఎన్నికలు జరగాలి." అని యూడబ్ల్యూడబ్ల్యూ పేర్కొంది.

దీంతోపాటు రెజ్లర్లపై వివక్ష చూపించకుండా అందరినీ ఒలింపిక్స్, ఇతర అంతర్జాతీయ ఈవెంట్లలోకి పరిగణించాలని వెల్లడించింది. ఈ మేరకు తమకు రెజ్లింగ్ సమాఖ్య రాతపూర్వక హామీ ఇవ్వాలని యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ సంస్థ సూచించింది. అంతే కాకుండా మాజీ అధ్యక్షుడుకి వ్యతిరేకంగా నిరసన తెలిపిన రెజ్లర్లను కూడా పరిగణలోకి తీసుకోవాలని తెలిపింది.

అసలేం జరిగిందంటే ?
WrestlingFederation Of India President :అండర్ -15, అండర్ -20 రెజ్లింగ్ ఛాంపియన్​షిప్స్ ఉత్తర్​ప్రదేశ్​ గోండాలోని నంది నగర్​లో జరుగుతాయని తొందరపాటుగా ప్రకటించారు సంజయ్​ సింగ్. దీంతో భారత క్రీడా మంత్రిత్వ శాఖ కొత్తప్యానెల్​ను సస్పెండ్ చేసింది. అయితే పోటీల్లో పాల్గొనే అథ్లెట్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డబ్ల్యూఎఫ్​ఐ నింబధనలకు విరుద్ధంగా ఇలా ప్రకటన చేసినందుకు క్రీడా శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అనంతరం డబ్ల్యూఎఫ్​ఐ క్యార్యకలాపాలు నిర్వహించేందుకు తాత్తాలిక కమిటీ ఏర్పాటు చేయాలని ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్​- ఐఓఏను ఆదేశించింది. అనంతరం కమిటీ ఏర్పాటు చేసిన ఐఓఏ, ఆ కమిటీకి ఛైర్మన్​గా భుపిందర్ సింగ్ భజ్వాను నియమిస్తున్నట్లు ప్రకటించింది.

WFI కొత్త ప్యానెల్ సస్పెన్షన్ రద్దు చేయలేం- మరోసారి ఎన్నికలకు తాత్కాలిక కమిటీ కసరత్తు! : క్రీడా శాఖ

పాలనా వ్యవహారాలకు కొత్త కమిటీ - 'ఇకపై ఆ ముగ్గురే చూసుకుంటారు'

Last Updated : Feb 13, 2024, 10:07 PM IST

ABOUT THE AUTHOR

...view details