Virat Kohli Unbeatable Cricket Records : క్రికెట్ హిస్టరీలో చాలా మంది ప్లేయర్లు అద్భుత రికార్డులు నెలకొల్పారు, బద్ధలు కొట్టారు. కానీ కొన్ని రికార్డులు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఇతర ఆటగాళ్లు వాటిని అందుకోవాలంటే అద్భుతమే జరగాలి. ప్రస్తుతం క్రికెట్‌లో కూడా వేగంగా మార్పులు వస్తున్న తరుణంలో కొందరు లెజెండరీ ప్లేయర్ల రికార్డులు బద్ధలు కావడం అసాధ్యమనే చెప్పొచ్చు. అయితే ఇటువంటి రికార్డులు ఎక్కువగా టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఖాతాలోనే ఉండటం గమనార్హం. ఈ క్రమంలో ఎప్పటికీ, ఎవ్వరికీ సాధ్యం కాని విరాట్ రికార్డులు ఏవో ఇప్పుడు చూద్దాం.
అత్యధిక వన్డే సెంచరీలు
50 ఓవర్ల ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు(50) రికార్డును కోహ్లీ అందుకున్నాడు. సచిన్ తెందూల్కర్ రికార్డును(49) అధిగమించాడు. టీ20లకి ప్రాధాన్యం పెరుగుతున్న సమయంలో, తక్కువగా వన్డే సిరీస్‌లు జరుగుతున్న కాలంలో మరో ప్లేయర్ 50 సెంచరీలు సాధించడం చాలా కష్టం.
అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్
కోహ్లీ టెస్టుల్లో 68 మ్యాచ్‌లలో 40 టెస్టు విజయాలు సాధించాడు. భారత అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌గా నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా కేవలం ముగ్గురు కెప్టెన్లు మాత్రమే టెస్టు చరిత్రలో ఎక్కువ విజయాలు తమ ఖాతాలో వేసుకున్నారు.
అత్యంత వేగంగా వన్డే పరుగులు
వన్డేల్లో అత్యంత వేగంగా 8000, 9000, 10000, 11000, 12000, 13000 పరుగుల మైలురాళ్లను అందుకున్న ఆటగాడు కోహ్లీ మాత్రమే కావడం విశేషం.
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు
సచిన్ పేరిట ఉన్న అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుల (20)ను కోహ్లీ అధిగమించాడు. ఏకంగా 21 అవార్డులతో రికార్డు క్రియేట్ చేశాడు. కోహ్లీకి సమీపంలో షకీబ్ అల్ హసన్ నాలుగు అవార్డుల వెనుక ఉన్నాడు.