Virat Kohli Hugs Lady : స్టేడియంలోనైనా సరే బయటైనా సరే టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తన ఆటకు ఫిదా అయ్యేవారితో పాటు తన లుక్స్‌కు మైమరిచిపోయే లేడీ ఫ్యాన్సూ చాలా మంది ఉన్నారు. కోహ్లీ మ్యాచ్ ఆడుతున్నాడంటే చాలు ఇక స్టేడియానికి పోటెత్తుతుంటారు. ఇటీవల రంజీ ట్రోఫీలో కోహ్లీ ఆడగా, ఆ మ్యాచ్‌ను వీక్షించేందుకు పెద్దసంఖ్యలో వచ్చారు. అంతేకాకుండా రీసెంట్గా కటక్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డే ప్రాక్టీస్ సెషన్స్‌లోనూ పోటెత్తారు. అయితే తాజాగా జరిగిన ఓ ఘటన ప్రస్తుతం క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షిస్తూ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే?
కోహ్లీయే హగ్ ఇచ్చిన 'లక్కీ లేడీ'
కోహ్లీ బయట కనిపిస్తే చాలు అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు అభిమానులు పోటీపడుతుంటారు. అయితే, తాజాగా కోహ్లీనే స్వయంగా ఓ మహిళ దగ్గరకు వెళ్లి మరీ హగ్ ఇచ్చాడు. భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అభిమానులందరూ విరాట్ నుంచి హగ్ అందుకున్న ఆ లక్కీ లేడీ ఎవరు?, తనను కోహ్లీ ఎందుకు హగ్ చేసుకున్నాడు? అంటూ నెట్టింట ఆరా తీస్తున్నారు.