Virat Kohli Fan RCB :క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌తో కొన్ని సార్లు అభిమానులు తమ ఫేవరట్ స్టార్స్‌ను నేరుగా చూసేందుకు స్టేడియంకు వెళ్తుంటారు. అక్కడ స్టాండ్స్‌లో నిలబడి వాళ్లకు సపోర్ట్ చేస్తూ ఉప్పొంగిపోతుంటారు. అయితే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం ఒళ్లు మరిచిపోయి ప్రవర్తించి ఆ ప్లేయర్ల దగ్గరికి వెళ్తుంటారు. మైదనంలోకి వెళ్లిపోయి వాళ్ల కాళ్ల పైన పడటం, కౌగిలించుకోవడం లాంటివి చేస్తుంటారు. ఇటీవలే అలాంటి ఓ ఘటన జరిగింది. అది జరిగిన కొద్ది క్షణాలకే వైరల్ కావడం వల్ల ఆ వీడియో ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించింది.
చిన్నస్వామి స్టేడియంలో ఇటీవలే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అభిమాని ఒకరు సెక్యూరిటినీ దాటుకుని అకస్మాత్తుగా క్రీజులోకి వచ్చేశాడు. తన అభిమాన క్రికెటర్‌ను చూసిన ఆనందంలో విరాట్ కాళ్ల మీద పడిపోయాడు. అయితే ఆ ఫ్యాన్స్ చేసిన పనికి షాక్ అయిన కోహ్లీ అతడిని లేపేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే సెక్యూరిటీ అక్కడికి చేరుకుని ఆ అభిమానిని పట్టుకున్నారు. అయినాప్పటికీ ఆ వ్యక్తి కోహ్లీని కౌగిలించుకున్నాడు. దీంతో సిబ్బంది ఆ ఫ్యాన్స్‌ను బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు.
ఇలాంటి ఘటనలు క్రికెట్ హిస్టరీలో చాలానే జరిగాయి కదా ఇందులో ఏముందని అనుకుంటే మీరు పొరబడినట్లే. ఈ సారి మాత్రం సెక్యూరిటీ సిబ్బంది తమ దూకుడును చూపించారు. ఆ వ్యక్తిని బయటికి ఈడ్చుకెళ్లిన తర్వాత చితక్కొట్టారు. కాళ్లతో తన్నడం కూడా చేశారు. ఆ తర్వాత అతడ్ని పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదంతా చూసిన అభిమానులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఒ అభిమాని చేసిన పనికి ఇలా చిత్కకొట్టాలా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది చేసింది సరైనదని కాదంటూ కామెంట్లు పెడుతున్నారు.