తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్యా బాత్ హై! - ఆర్టిస్​గా మారిన విరాట్ - ఆ ఐకానిక్​ పిల్లి బొమ్మను చూశారా? - Virat Kohli Cat Drawing - VIRAT KOHLI CAT DRAWING

Virat Kohli Cat Drawing : రాట్‌ కోహ్లి తనలో ఉన్న మరో గొప్ప ట్యాలెంట్‌ను బయటపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. ఆ సూపర్‌ ట్యాలెంట్‌ ఏంటో తెలుసా?

Virat Kohli
Virat Kohli (Getty Images)

By ETV Bharat Sports Team

Published : Sep 24, 2024, 8:00 PM IST

Virat Kohli Cat Drawing :టీమ్​ఇండియా స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. స్థిరంగా పరుగులు చేయడానికి, సక్సెస్‌ఫుల్‌ కావడానికి ఫిట్‌నెస్‌ మెయింటైన్‌ చేయడం కూడా కారణమని విరాట్‌ చాలా సందర్భాల్లో చెప్పాడు. ఇవి మాత్రమే కాదు, విరాట్‌ వద్ద మరో గొప్ప ట్యాలెంట్‌ కూడా ఉంది. అదే డ్రాయింగ్‌. ఆశ్చర్యంగా ఉందా? తాజాగా విరాట్‌ లైవ్‌లో గీసిన అద్భుతమైన డ్రాయింగ్‌ని చూద్దాం పదండి.

తాజాగా ఆయన ప్రముఖ స్పోర్ట్స్​ ఎక్విప్​మెంట్​ ఉత్పత్తి ప్రమోషన్స్​లో భాగంగా జరిగిన ఈవెంట్​లో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. అందులో విరాట్​ను ఆ బ్రాండ్​ లోగోనూ రాసే పనిని విరాట్‌కి అప్పగిస్తారు. దాంతో అతడు అద్భుతమైన డ్రాయింగ్‌ గీయడానికి కాన్వాస్‌ ముందు బ్రష్‌ పట్టుకుని కూర్చుంటాడు. అక్కడే పిల్లి వేషధారణలో ఒకరు వచ్చి సోఫాలో పడుకుంటారు. అయితే ఆ వ్యక్తి పోజులు ఇస్తుండగా విరాట్ డ్రాయింగ్‌ పూర్తి చేశాడు. డ్రాయింగ్‌ చూసుకోండని, చెబుతూ, దానిపైన సైన్‌ చేస్తాడు. అయితే ఆ డ్రాయింగ్ కాస్త ఫన్నీగా ఉండటం వల్ల విరాట్ అభిమానులు, నెటిజన్లు ఆ వీడియోపై సరదాగా కామెంట్లు పెడుతున్నారు. విరాట్​లో ఈ ట్యాలెంట్​ మేమెప్పుడూ చూడలేదని అంటున్నారు.

రెండో టెస్ట్‌కి రెడీ
చేపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్టులో భారత్‌ ఏకంగా 280 పరుగులతో భారీ విజయం అందుకుంది. రెండు ఇన్నింగ్స్‌లలో విరాట్‌ విఫలమయ్యాడు. వరుసగా 6(6), 17(37) పరుగులకు అవుట్‌ అయ్యాడు. సెప్టెంబర్ 27న కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్‌లో ప్రారంభం కానున్న రెండో టెస్ట్‌కి సిద్ధమవుతున్నాడు. ఈ మ్యాచ్‌లో తిరిగి ఫామ్‌ అందుకోవాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

రెండో టెస్ట్‌కి టీమ్‌ ఇండియా స్క్వాడ్‌ : రోహిత్ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్‌ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), ధృవ్ జురెల్ (వికెట్‌ కీపర్‌), అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్‌ సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.

మలింగ పేరుతో విరాట్ స్లెడ్జింగ్​ - స్టార్ స్పిన్నర్ రియాక్షన్ ఇదే! - India Vs Bangladesh 1st Test

కోహ్లీని కలిసిన రాధిక శరత్​ కుమార్​ - ఎందుకంటే? - Radikaa Sarathkumar Kohli

ABOUT THE AUTHOR

...view details