Virat Kohli Australia Match Ban : స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ క్రీజులో ఎంతో అగ్రెసివ్‌గా కనిపిస్తుంటాడు. తన ఆటతీరులో అది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దీని కారణంగా అతడు ఎన్నో సార్లు కాంట్రవర్సీల పాలయ్యాడు. ముఖ్యంగా అంతర్జాతీయ ఫార్మాట్లో స్లెడ్జింగ్‌కు పాల్పడి ఓ సారి వివాదంలో చిక్కుకున్నాడు. దీని కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధం ఎదుర్కొనే పరిస్థితి కూడా వచ్చింది.
అయితే ఆ మ్యాచ్ రిఫరీని కోహ్లీ రిక్వెస్ట్ చేయడం వల్ల, కేవలం మ్యాచ్ ఫీజు కోతతో తప్పించుకున్నాడు. ఈ ఘటన జరిగి దాదాపు 12 ఏళ్లు కాగా, దీని గురించి విరాట్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
ఇంతకీ ఆ రోజు ఏమైందంటే ?
ఆస్ట్రేలియా వేదికగా 2012లో జరిగిన టెస్ట్ సిరీస్ కోసం టీమ్ఇండియా వెళ్లింది. అక్కడ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన రెండో టెస్టు సమయంలో ప్రత్యర్థి జట్టు అభిమానులు విరాట్ కోహ్లీని టార్గెట్‌గా చేస్తూ కామెంట్లు చేశారు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన కోహ్లీ వారికి ఆ మాటలకు బదులుగా వారికి మిడిల్ ఫింగర్ చూపించాడు. దీంతో అక్కడివారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఈ నేపథ్యంలో విరాట్ అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు.