ETV Bharat / sports

డ్రెస్సింగ్ రూమ్‌లో ధావన్ సందడి- అంతా నవ్వులే నవ్వులు - IND VS PAK 2025

టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూమ్​లో ధావన్ సందడి- వీడియో రిలీజ్ చేసిన బీసీసీఐ

Ind vs Pak 2025
Ind vs Pak 2025 (Source : BCCI 'X' Post Screenshot)
author img

By ETV Bharat Sports Team

Published : Feb 24, 2025, 5:25 PM IST

Shikhar Dhawan India Dressing Room : టీమ్ఇండియా మాజీ ప్లేయర్ శిఖర్ ధావన్ తాజాగా జట్టు డ్రెస్సింగ్ రూమ్​లో సందడి చేశాడు. దుబాయ్ వేదికగా పాకిస్థాన్​తో మ్యాచ్ అనంతరం, బెస్ట్ ఫీల్డర్ విన్నర్‌ను ప్రకటించడానికి కోచ్ దిలీప్‌ శిఖర్ ధావన్‌ను టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఆహ్వానించారు. భారత ఆటగాళ్లు చప్పట్లు కొడుతూ ధావన్‌ను స్వాగతం పలికారు. హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా అతడిని హాగ్ చేసుకున్నారు. అనంతరం శిఖర్ ఆటగాళ్లతో ముచ్చటించాడు.

ముందుగా ఘన విజయం సాధించిన టీమ్ఇండియాకు శుభాకాంక్షలు తెలిపాడు. ముఖ్యంగా బంతితో అదరగొట్టిన బౌలింగ్ యూనిట్​ను, బ్యాటింగ్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్‌, శ్రేయస్ అయ్యర్‌ను ధావన్ అభినందించాడు. జట్టులోని సీనియర్లు, సపోర్టింగ్ టీమ్​ను కూడా మెచ్చుకున్నాడు. ఇక తనను డ్రెస్సింగ్ రూమ్​లోకి ఆహ్వానించినందుకు థాంక్స్ చెప్పాడు. చివరకు అక్షర్ పటేల్‌ను బెస్ట్ ఫీల్డర్‌గా ప్రకటించి మెడల్‌ను బహుకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అక్షర్ కీలక పాత్ర
ఆదివారం పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్ ఒక వికెట్​తోపాటు ఓ క్యాచ్ పట్టి రెండు రనౌట్‌లు చేశాడు. ఇమామ్ ఉల్ హక్ (10) షార్ట్‌ కవర్స్‌ వైపు బంతిని ఆడి కొంచెం నెమ్మదిగా కదిలాడు. అక్షర్‌ చురుగ్గా కదిలి వికెట్ల పైకి డైరెక్ట్‌ త్రో విసరడం వల్ల ఇమామ్‌ పెవిలియన్‌ చేరాడు. తర్వాత రిజ్వాన్ (46)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. కాసేపటికే హార్దిక్ బౌలింగ్ బౌలింగ్​లో సౌద్ షకీల్ (62) ఇచ్చిన క్యాచ్‌ను అందుకున్నాడు. హారిస్ రవూఫ్‌ (8) రనౌట్‌లోనూ అక్షర్ కీలకంగా వ్యవహరించాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ (100*) సెంచరీతో అదరగొట్టగా, శ్రేయస్ అయ్యర్ (56) హాఫ్ సెంచరీ, శుభ్​మన్ గిల్ (46) రాణించారు. తాజా విజయంతో టీమ్ఇండియా సెమీఫైనల్ బెర్తు దాదాపు ఖరారైనట్లే! అటు వరుసగా రెండో ఓటమితో పాకిస్థాన్​ టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించింది.

ఆల్​టైమ్ రికార్డ్- క్రికెట్ హిస్టరీలోనే హైయ్యెస్ట్ వ్యూవర్​షిప్- అంతా 'విరాట్' మాయే!

విరాట్ సెంచరీకి పాకిస్థాన్​లో సంబరాలు- ఇదిరా 'కింగ్' రేంజ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.