తెలంగాణ

telangana

ETV Bharat / sports

వాళ్లతో విరాట్​ను పోలుస్తుంటే నవ్వొస్తోంది! - ఈ జనరేషన్​లో బెస్ట్​ ప్లేయర్ అతడే' - MOHAMMED AMIR ABOUT VIRAT KOHLI

విరాట్​ను పొగడ్తలతో ముంచెత్తిన మాజీ పాకిస్థాన్ క్రికెటర్ - పూర్తి వివరాలు స్టోరీలో!

Mohammed Amir About Virat Kohli
Virat Kohli (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Dec 23, 2024, 9:58 AM IST

Mohammed Amir About Virat Kohli :ఈ జనరేషన్​లో బెస్ట్​ క్రికెటర్‌ ఎవరనే ఈ ప్రశ్నకు ప్రతి ఒక్కరూ ఒక్కో ఆన్సర్ ఇస్తారు. జో రూట్, విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ ఈ నలుగురిని ఫ్యాబ్‌4గా ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటారు. అయితే వీరికి పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్‌ కూడా కొన్నాళ్లపాటు గట్టి పోటీనిచ్చాడు. అయితే, విరాట్‌తో ఇంకో స్టార్ క్రికెటర్​ను పోలుస్తూ కామెంట్​ చేస్తుంటే తనకు నవ్వు వస్తుందని పాక్‌ మాజీ ప్లేయర్ మహ్మద్ ఆమిర్ తాజాగా వ్యాఖ్యానించాడు. ఈ తరంలో కోహ్లీనే అత్యుత్తమ ప్లేయర్‌ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు.

"ఈ జనరేషన్‌కు విరాట్ కోహ్లీ బెస్ట్ క్రికెటర్. తనతో బాబర్‌ అజామ్‌, స్మిత్, జో రూట్‌ను పోలుస్తుంటే నాకు నవ్వొస్తుంది. కోహ్లీతో ఎవ్వరినీ పోల్చలేం. భారత్‌ను చాలా మ్యాచుల్లో విజేతగా నిలపడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. ఇంకో ప్లేయర్‌కు సాధ్యంకాని రీతిలో పరుగులను నమోదు చేశాడు. ఏదో ఒక ఫార్మాట్‌లోనే కాకుండా అన్నింటిలో రాణించడం గొప్ప విషయం. పనిపై చూపించే నిబద్ధతే కోహ్లీని మరింత ప్రత్యేకంగా మార్చింది. 2014లో ఇంగ్లండ్‌ టూర్​లో దారుణమైన పెర్ఫామెన్స్ చేశాడు. అయితే, అతడి కమ్​బ్యాక్​ మాత్రం అద్భుతంగా ఉంది. నిలకడగా పరుగులు చేస్తూ గత పదేళ్లుగా భారత జట్టుకు అతడు కీలకంగా మారాడు" అని ఆమిర్‌ తెలిపాడు.

2017 ఛాంపియన్స్‌ ట్రోఫీలో విరాట్ కీలక పాత్ర పోషించాడని ఆమిర్ కొనియాడాడు. ఫైనల్‌లో అతడి వికెట్‌ను తీయడమే తమ విజయానికి కారణమైందని అన్నాడు. ఒకవేళ అతడు ఔట్ కాకుండా ఉంటే కచ్చితంగా ఆ మ్యాచ్‌ను ఓడిపోయేవాళ్లమని పేర్కొన్నాడు.

"2017 ఛాంపియన్స్‌ ట్రోఫీలో విరాట్ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్‌లో అతడి వికెట్‌ను తీయడమే మా జట్టు విజయానికి కారణమైంది. ఒకవేళ తను ఔట్ కాకుండా ఉండుంటే కచ్చితంగా ఆ మ్యాచ్‌ను మేము ఓడిపోయేవాళ్లమే. ఛేజింగ్‌లో విరాట్ కోహ్లీ మరింత దూకుడుగా ఆడాడు. ఇక నా జీవితంలో సచిన్‌ తెందూల్కర్‌కు ఒకే ఒక్కసారి బౌలింగ్‌ చేశాను. 2009 ఛాంపియన్స్‌ ట్రోఫీలో సచిన్‌ను నేను ఔట్ చేశాను. నా కెరీర్‌లో అదొక ప్రత్యేకమైన క్షణంగా భావిస్తాను" అని ఆమిర్ అన్నాడు.

'ఆ మ్యాచ్ ఓటమితో కోహ్లీ బాగా ఏడ్చాడు' - అనుష్క మాటలను గుర్తుచేసుకున్న ధావన్

రోహిత్ విరాట్ కాకుండా ఈ ఏడాది క్రికెట్​కు వీడ్కోలు పలికిన ప్లేయర్లు ఎవరంటే?

ABOUT THE AUTHOR

...view details