తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెస్టుల​కు వరుణ్ ఆరోన్ గుడ్​బై- ఎందుకో తెలుసా?

Varun Aaron Retirement: టీమ్ఇండియా సీనియర్ బౌలర్ వరుణ్ ఆరోన్ రెడ్​బాల్ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుత రంజీ ట్రోఫీయే టెస్టుల్లో ఆఖరిదని అరోన్ చెప్పాడు.

Varun Aaron Retirement
Varun Aaron Retirement

By ETV Bharat Telugu Team

Published : Feb 16, 2024, 3:50 PM IST

Updated : Feb 16, 2024, 4:55 PM IST

Varun Aaron Retirement:టీమ్ఇండియా పేస్ బౌలర్ వరుణ్ ఆరోన్ ఫస్ట్​ క్లాస్​ క్రికెట్ (టెస్టు)​కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం జరుగుతున్న 2024 రంజీ ట్రోఫీలో వరుణ్ ఝార్ఖండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నమెంట్​లో ఝార్ఖండ్- రాజస్థాన్ మ్యాచ్​ తన కెరీర్​లో ఆఖరి టెస్టు అని శుక్రవారం తెలిపాడు. '2008 నుంచి రెడ్​బాల్ క్రికెట్ ఆడుతున్నా. బౌలింగ్ చేస్తున్న క్రమంలో ఎన్నోసార్లు గాయపడ్డాను. ప్రస్తుతం టెస్టు క్రికెట్​లో బౌలింగ్ చేయడానికి నా శరీరం సహకరించట్లేదు. అందుకే రెడ్​బాల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నా. జమ్​షెద్​పుర్​ ఆడియెన్స్, నా ఫ్యామిలీ ముందు ఇదే నా ఆఖరి మ్యాచ్ కావచ్చు. ఈ గ్రౌండ్ (కీనన్ స్టేడియం)​లో వైట్​బాల్ క్రికెట్ మ్యాచ్​లు ఉండకపోవచ్చు' అని అన్నాడు.

34ఏళ్ల వరుణ్ 2011లో టీమ్ఇండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 2011- 15 మధ్య కాలంలో మొత్తం 9 మ్యాచ్​లు ఆడిన వరున్ 18 వికెట్లు పడగొట్టాడు. ఇక 2015 తర్వాత టెస్టుల్లో మళ్లీ టీమ్ఇండియాకు వరుణ్ ప్రాతినిధ్యం వహించలేదు. కానీ, ప్రతి ఏటా ఐపీఎల్​లో మాత్రం ఆడుతున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్​ల్లో 52 మ్యాచ్​లు ఆడిన వరుణ్ 44 వికెట్లు నేలకూల్చాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్​ జట్టులో ఉన్న వరుణ్ గతంలో రాజస్థాన్ రాయల్స్​, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ డేర్​డెవిల్స్ ఫ్రాంఛైజీలకు ఆడాడు.

2011లోనే వన్డేల్లోనూ అరంగేట్రం చేసిన వరుణ్ ఎక్కువ కాలం జట్టులో స్థానం నిలబెట్టుకోలేకపోయాడు. అతడు 2011 నుంచి 2014 వరకు మాత్రమే టీమ్ఇండియాకు వన్డేల్లో ఆడాడు. అందులో కేవలం 9 మ్యాచ్​లే ఆడిన వరుణ్ 11 వికెట్లు పడగొట్టాడు. ఇక 2015లో వరుణ్ బెంగళూరు చిన్నస్వామి వేదికగా సౌతాఫ్రికాతో మ్యాచ్​లో చివరిసారి టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. కాగా, అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం వరుణ్ ఎంట్రీ ఇవ్వలేకపోయాడు.

Jharkhand Ranji Team 2024: ప్రస్తుతం రంజీలో ఝార్ఖండ్ క్వార్టర్ ఫైనల్​కు అర్హత సాధించలేదు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 6 మ్యాచ్​లు ఆడిన ఝార్ఖండ్ ఒక్కvarun aaron iplటంటే ఒక్క మ్యాచ్​లోనే నెగ్గి ఎలైట్ గ్రూప్- Aలో 7వ స్థానంలో ఉంది.

అక్తర్​ నుంచి ఉమ్రాన్​ వరకు వీళ్లే ఫాస్టెస్ట్​​ బౌలర్స్ వీరు బంతి విసిరింతే ఇక అంతే

లలిత్‌ మోదీ బెదిరించాడు - భారత మాజీ పేసర్‌ సంచలన ఆరోపణలు

Last Updated : Feb 16, 2024, 4:55 PM IST

ABOUT THE AUTHOR

...view details