ETV Bharat / sports

ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం రాహుల్‌, సూర్యకుమార్‌కి ఆహ్వానం - పాకిస్థాన్ కొత్త కెప్టెన్​ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా!

పాకిస్థాన్ కొత్త కెప్టెన్​ స్పెషల్ రిక్వెస్ట్ - ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం రాహుల్‌, సూర్యకుమార్‌కి ఆహ్వానం

Mohammad Rizwan Champions Trophy 2025
Mohammad Rizwan (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 13, 2024, 7:50 PM IST

Mohammad Rizwan Champions Trophy 2025 : కొత్తగా పాకిస్థాన్‌ టెస్ట్‌ టీమ్‌ కెప్టెన్‌ అయిన మహ్మద్ రిజ్వాన్ భారత ఆటగాళ్లకు స్వాగతం పలికి అందరి హృదయాలు గెలుచుకున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాక్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం మొత్తం జట్టుతో పాకిస్థాన్‌లో పర్యటించాలని కోరుతూ భారత ఆటగాళ్లు కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్‌కు వెల్‌కమింగ్‌ మెసేజ్‌ పంపాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడానికి భారత్ పాకిస్థాన్‌కు వెళ్లబోదని ఐసీసీ అధికారికంగా పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (PCB)కి తెలియజేయడం వల్ల గందరగోళం నెలకొంది. ఈ తరుణంలో రిజ్వాన్ టీమ్​ఇండియాను ఆహ్వానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20ఐ సిరీస్ ప్రారంభానికి ముందు బుధవారం బ్రిస్బేన్‌లోని గబ్బా వద్ద మీడియాతో రిజ్వాన్ మాట్లాడాడు. ఈ సందర్భంగా భారత ఆటగాళ్లకు స్వాగతం పలికాడు. ప్రస్తుతం నెలకొన్న గందరగోళం త్వరగా పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

భారత్‌కి ఆహ్వానం
మీడియా ముందు రిజ్వాన్‌, "కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్‌కు స్వాగతం. వచ్చే ఆటగాళ్లందరికీ స్వాగతం పలుకుతాం. ఇది మా నిర్ణయం కాదు, పీసీబీ నిర్ణయం. ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ చర్చించి సరైన పిలుపునిస్తారని ఆశిస్తున్నాను. కానీ భారత ఆటగాళ్లు వస్తారనే ఆశాభావంతో ఉన్నాం' అని చెప్పాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ పరిస్థితి ఏంటి?
ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు పాకిస్థాన్‌కి భారత్‌ వెళ్లదని ఈ వారం ప్రారంభంలో ఐసీసీ అధికారికంగా PCBకి తెలియజేసింది. భారతదేశం వైఖరికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి పీసీబీ, పాకిస్థాన్‌ ప్రభుత్వాన్ని సంప్రదించింది. కొన్ని నివేదికల మేరకు, పాక్‌ టోర్నీ నుంచి వైదొలగవచ్చని సూచిస్తున్నాయి. కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, "టోర్నీలో భారత్‌ పాల్గొనడం ఐసీసీ రెవెన్యూని పెంచితే, అదే స్థాయిలో పాకిస్థాన్‌ కూడా కీలకం. పాకిస్థాన్‌- భారత్ మ్యాచ్‌లు లేకపోతే ఐసీసీ రెవెన్యూ గణనీయంగా దెబ్బతింటుంది." అని పేర్కొన్నాయి.

బీసీసీఐ గత సంవత్సరం ఆసియా కప్‌ సమయంలో పని చేసిన హైబ్రిడ్ మోడల్‌ను స్వీకరించమని ఐసీసీని కోరింది. అప్పుడు కూడా పాక్‌ ఆతిథ్యం ఇవ్వగా, భారత్ మ్యాచ్‌లు మాత్రం శ్రీలంకలో జరిపారు. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్‌ మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగుతాయని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆ అవకాశం, ఆలోచన లేదని పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ప్రకటించారు. తాజాగా వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీని దక్షిణాఫ్రికాలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించకపోతే PCBకి కలిగే నష్టం ఎంతంటే?

ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ - పీసీబీ వైఖరిపై పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.