Traffic Diversions in Hyderabad For New year 2025 : న్యూ ఇయర్ సెలబ్రెషన్స్ సందర్భంగా హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మంగళవారం రాత్రి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు ఉంటాయని నగర అదనపు ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు ఏయో ప్రాంతాల్లో ఆంక్షలు ఉండనున్నాయి అంటే.
- నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుంచి ట్రాఫిక్ అనుమతించరు. అర్ధరాత్రి దాటిన తరువాత 2 గంటల వరకు ట్యాంక్‌బండ్ చుట్టూ వాహనాల రాకపోకలపై అవసరాన్ని బట్టి ఆంక్షలు అమలు చేస్తారు.
- టోలిచౌకీ, బేగంపేట్ మినహా హైదరాబాద్‌లోని అన్ని ఫ్లై ఓవర్లు రాత్రి నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు మూసివేస్తారు. పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే ఫ్లైఓవర్‌పై విమాన టికెట్లు ఉండి, శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఉంటుంది.
- రాత్రి 10 గంటల తర్వాత హైదరాబాద్ పరిధిలోని ప్రైవేటు ట్రావెల్ బస్సులు, లారీలు, హెవీ గూడ్స్, ప్యాసింజర్ వాహనాలు అనుమతించరు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రైవేటు బస్సులు ఓఆర్‌ఆర్ మీదుగా వెళ్లాల్సిందే.
పార్కింగ్ ప్రదేశాలు : ముఖ్యంగా ఈ సమయాల్లో పార్కింగ్ కోసం తెగ వెతికేస్తుంటారు. వారికోసం సెక్రటేరియేట్ విజిటర్స్ పార్కింగ్, ప్రసాద్ మల్టీప్లెక్స్ పక్కన హెచ్‌ఎండీఏ గ్రౌండ్, జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం లేన్, రేస్ కోర్స్ రోడ్డు (ఎన్టీఆర్ ఘాట్ పక్కన), ఆదర్శనగర్ లేన్ (బైక్‌లు మాత్రమే) వద్ద వాహనాలు పార్కింగ్ చేయొచ్చు.
ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు : హుస్సేన్‌సాగర్ వద్ద వీవీ విగ్రహం, ప్రింటింగ్ ప్రెస్, ఖైరతాబాద్ బడా గణేష్, రాజ్‌భవన్ వైపు, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, షాదన్ కళాశాల, సచివాలయం, పాత అంబేడ్కర్ విగ్రహం, ఎన్టీఆర్ మార్గ్, ఇక్బాల్ మినార్, మింట్ కాంపౌండ్ లేన్, ఇక్బాల్ మినార్, రాజ్‌దూత్ లేన్, లక్డీకాపూల్, పాత అంబేడ్కర్ విగ్రహం, సచివాలయం జంక్షన్, అప్పర్ ట్యాంక్‌బండ్, సచివాలయం జంక్షన్, మర్రి చెట్టు, మార్కెట్, నెక్లెస్ రోటరీ, సెన్షేషన్ థియేటర్, లిబర్టీ, నల్లగుట్ట ఎక్స్ రోడ్స్, మినిస్టర్ రోడ్డు, పీవీఎన్‌ఆర్ మార్గ్, సీజీఓ టవర్స్, సెయిలింగ్ క్లబ్ జబ్బార్ కాంప్లెక్స్ రాణిగంజ్, బుద్ధభవన్, కర్బలా మైదాన్, డీబీఆర్ మిల్స్, దోభిఘాట్, చిల్ట్రన్స్ పార్క్, కవాడిగూడ ఎక్స్ రోడ్స్.
రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు : సీపీ అవినాశ్ మహంతి
ఆ వాహనాలకు అనుమతి లేదు : ఈ నెల 31న నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ ఉత్తర్వులు జారీ చేశారు. విమానాశ్రయానికి వెళ్లే వాహనాలు తప్ప ఇతర లైట్ మోటార్ వాహనాలను ఓఆర్‌ఆర్‌పై అనుమతించరని స్పష్టం చేశారు.
- క్యాబ్స్, ట్యాక్సీలు, ఆటో డ్రైవర్లు యూనిఫాం ధరించడంతో పాటు డాక్యుమెంట్లను వెంట ఉంచుకోవాలి.
- ప్రయాణికులు ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా డ్రైవర్లు నిరాకరించడం, అదనంగా వసూలు చేస్తే పోలీసులకు సమాచారమివ్వాలని తెలిపారు.
- బార్‌లు, పబ్‌లు, క్లబ్‌ల నిర్వాహకులు వినియోగదారులు మద్యం మత్తులో వాహనం నడపకుండా చూడాలని అన్నారు. వినియోగదారులు క్షేమంగా ఇళ్లకు చేరేలా యాజమాన్యమే తగిన ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
- రాత్రి 8 గంటల నుంచి కమిషనరేట్ పరిధిలోని అన్ని రహదారులు, కూడళ్లలో విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలుంటాయని స్పష్టంగా చెప్పారు.
- తగిన ధ్రువపత్రాలు చూపించని వాహనాలను పోలీసులు జప్తు చేస్తారని తెలిపారు.
- మైనర్లు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపే వారి వాహనాలు స్వాధీనం చేసుకోవడమే కాకుండా వాహన యజమానిపై కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు.
- నంబర్ ప్లేట్ ఉండని, అధిక శబ్దం చేసే వాహనాలు స్వాధీనం చేసుకొని విచారణ కోసం ఆర్టీఏ అధికారులకు అప్పగిస్తామన్నారు.
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ - ప్రత్యేక ఆకర్షణగా సినీ తారలు, డీజేలు
న్యూ ఇయర్ రోజు పార్టీ చేసుకుంటున్నారా - అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే