ETV Bharat / sports

'కోహ్లీ విషయంలో అలా జరగడం నా తప్పే' - రోహిత్​

ఈడెన్‌ గార్డెన్స్‌లో రోహిత్‌ సృష్టించిన విధ్వంసం గుర్తుందా?

Kohli Rohith Sharma
Kohli Rohith Sharma (source AFP)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 13, 2024, 8:51 PM IST

Kohli Rohith Sharma : క్రికెట్‌ చరిత్రలో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఉన్నాయి. అందులో ఒకటి రోహిత్ శర్మది కూడా ఉంది. పదేళ్ల క్రితం నవంబర్ 13న పెను తుపాను సృష్టించాడు హిట్ మ్యాన్​. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకపై 173 బంతుల్లో ఏకంగా 264 పరుగులు బాదాడు. ఈ మ్యాచ్​లో ఓపెనర్‌గా వచ్చిన రోహిత్‌ క్రీజులో 225 నిమిషాల పాటు ఉన్నాడు. 152.60 స్ట్రైక్‌ రేటుతో 33 ఫోర్లు, 9 సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు.

కోహ్లీ రనౌట్‌కి నాదే బాధ్యత! - అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీ రనౌట్‌ అయ్యాడు. అయితే ఇందులో విరాట్​ తప్పేం లేదని, తప్పంతా తనదేనని రోహిత్‌ చెప్పుకొచ్చాడు. కోహ్లీ 66 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. అప్పటికీ రోహిత్‌- కోహ్లి జోడీ మూడో వికెట్‌కు 202 పరుగులు భారీ భాగస్వామ్యం నెలకొల్పింది.

ఈ క్రమంలోనే మ్యాచ్‌లో విరాట్​ లాంగ్ ఆన్‌లో ఓ షాట్‌ ఆడగా మాథ్యూస్‌ క్యాచ్‌ అందుకోవడానికి ప్రయత్నించాడు. బంతి అతడి ముందు పడి బౌన్స్‌ అయింది. మాథ్యూస్‌ వెంటనే స్పందించి అద్భుతంగా బాల్‌ ఆపాడు. ఈ సమయంలో రన్‌ తీసే విషయంలో రోహిత్‌, కోహ్లీ మధ్య కన్ఫూజన్‌ క్రియేట్‌ అవుతుంది. ఈ క్రమంలోనే స్ట్రైకర్ ఎండ్​లో ఉన్న విరాట్​ రనౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ కొనసాగించిన రోహిత్‌ భారీ స్కోరుతో భారత్‌ను తిరుగులేని స్థానంలో నిలబెట్టాడు.

దీనిపై అప్పుడు హిట్‌మ్యాన్‌ మాట్లాడుతూ, "కీలక భాగస్వామ్యం తర్వాత కోహ్లీ అవుట్‌ అవ్వడం నిరాశ కలిగించింది. నాకు నేను ముందుకెళ్లాలని చెప్పుకున్నాను. ఈడెన్ గార్డెన్స్‌లో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌ నిజంగా ప్రత్యేకమైంది." అని చెప్పాడు.

కాగా, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈ పోరు నాలుగో మ్యాచ్. ఇందులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్‌ చెలరేగడంతో భారత్‌ 404-5 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక 251 పరుగులకు ఆలౌట్ అయింది. పేసర్ ధావల్ కులకర్ణి 10 ఓవర్లలో 4-34తో అద్భుత గణాంకాలు నమోదు చేశాడు. శ్రీలంక కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ 68 బంతుల్లో 75 పరుగులు టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత్ 153 పరుగుల తేడాతో విజయం అందుకుంది.

మూడు డబుల్‌ సెంచరీలు - వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్‌ రోహిత్‌. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు, అత్యధిక డబుల్‌ సెంచరీల రికార్డు అతడి ఖాతాలోనే ఉన్నాయి. 2013 నవంబర్‌లో బెంగళూరులో ఆస్ట్రేలియాపై 209, 2017 డిసెంబర్‌లో మొహాలీలో శ్రీలంకపై 208 * పరుగులు చేశాడు.

బోర్డర్ గావస్కర్ ట్రోఫీ - కోహ్లీ, రోహిత్ ఫామ్‌పై మైండ్‌ గేమ్‌ స్టార్ట్

ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం రాహుల్‌, సూర్యకుమార్‌కి ఆహ్వానం - పాకిస్థాన్ కొత్త కెప్టెన్​ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.