ETV Bharat / sports

ఐపీఎల్ ముందు అర్జున్ తెందూల్కర్ సంచలనం! - సచిన్ సాధించలేని ఆ రేర్​ రికార్డ్ సొంతం - ARJUN TENDULKAR RANJI TROPHY

అర్జున్ తెందూల్కర్ అరుదైన ఘనత - తండ్రి సాధించనిది తనయుడు చేశాడు!

Arjun Tendulkar Ranji Trophy
Arjun Tendulkar Ranji Trophy (IANS, Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 13, 2024, 7:17 PM IST

Arjun Tendulkar Ranji Trophy : టీమ్ఇండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ తనయుడు అర్జున్ తాజాగా ఓ అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం రంజీలో గోవా జట్టు తరఫున ఆడుతున్న ఈ యంగ్ ప్లేయర్ రీసెంట్​గా అరుణాచల్ ప్రదేశ్​తో జరిగిన మ్యాచ్​లో తొమ్మిది ఓవర్లు బౌలింగ్ చేసి తన ఖాతాలో ఐదు వికెట్లు వేసుకున్నాడు. ఈ అద్భుతమైన ఫీట్​తో అందరినీ అబ్బురపరిచి జట్టుకు కీలక ఇన్నింగ్స్ అందించాడు.

సచిన్ చేయనిది అర్జున్ సాధించాడు!
అయితే అర్జున్ ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ ద్వారా తన తండ్రి తన క్రికెట్​ కెరీర్​లో చేయలేని ఓ రేర్​ ఫీట్​ను సొంతం చేసుకున్నాడు. సచిన్ తన కెరీర్‌లో మొత్తం 310 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 200 టెస్టు మ్యాచ్‌లు ఆడగా, అందులో 81 సెంచరీలతో 25396 పరుగులు చేశాడు. అంతేకాకుండా అతడు 71 వికెట్లు కూడా తీశాడు. అయితే ఒక్క ఇన్నింగ్స్‌లోనూ మూడు వికెట్లకు మించి తీయలేదు. కాగా, రెడ్-బాల్ క్రికెట్‌లో అతడి అత్యుత్తమ గణాంకాలు 3/10. అదే తన సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో సచిన్ వన్డేల్లో రెండు సార్లు ఐదు వికెట్లు తీయగలిగాడు. మొత్తంగా 50 ఓవర్ల ఫార్మాట్‌లో 5.10 ఎకానమీతో 154 వికెట్లు పడగొట్టాడు.
కానీ అర్జున్ మాత్రం ఇప్పటి వరకూ తన కెరీర్​లో ఆడిన 16 ఫస్ట్ క్లాస్ గేమ్‌లలో 32 వికెట్లు తీశాడు. అతని మునుపటి అత్యుత్తమ గణాంకాలు 4/49 కాగా, బ్యాటింగ్‌తో 23.13 సగటుతో 532 పరుగులు చేశాడు.

మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అరుణాచల్‌ ప్రదేశ్‌ తొలి రోజు 84 పరుగులకే ఆలౌట్ అయింది. 9 ఓవర్లు బౌలింగ్‌ చేసిన అర్జున్ 5-25తో అద్భుత గణాంకాలు నమోదు చేశాడు. అరుణాచల్ ప్రదేశ్‌ టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్‌లు ఐదుగురిని అర్జున్‌ పడగొట్టాడు. ఓపెనర్లు నెబాబ్ హచాంగ్, నీలమ్ ఒబీ ఇద్దరినీ అవుట్ చేశాడు. ఆ తర్వాత వరుగా జే భావ్సర్, చిన్మయ్ పాటిల్, మోజి ఈటెలను పెవిలిన్‌కి పంపాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.