తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్, పాక్ మ్యాచ్​ జట్టులోకి 13 ఏళ్ల IPL బాయ్​ - ఈ ఆసక్తి పోరు ఫ్రీగా ఎలా చూడాలంటే? - UNDER 19 ASIACUP 2024

ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం - టీమ్ ఇండియా పాకిస్థాన్ మ్యాచ్​ లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్​.

IND VS PAK Match
IND VS PAK Match (source ETV Bharat)

By ETV Bharat Sports Team

Published : Nov 30, 2024, 7:33 AM IST

IND VS PAK Match : అండర్ 19 ఆసియా కప్ 2024లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. దుబాయ్, షార్జా వేదికగా జరుగనున్న ఈ అండర్‌-19 ఆసియాకప్‌ వన్డే టోర్నీ గ్రూప్‌-ఎలో చిరకాల ప్రత్యర్థులు టీమ్ ఇండియా - పాకిస్థాన్‌ తలపడనున్నాయి. శనివారం ఈ దాయాది జట్ల మధ్య పోరు జరగనుంది. ఈ టోర్నీలో ఈ రెండు జట్లకు ఇదే తొలి మ్యాచ్‌. మహ్మద్‌ అమన్‌ కెప్టెన్సీలో టీమ్ ఇండియా, పాకిస్థాన్​ సవాల్‌ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి మరి. కాగా, టీమ్‌ ఇండియా తొమ్మిదో సారి ఆసియా కప్‌పై గురి పెట్టింది. పాక్‌ రెండో టైటిల్‌ ముద్దాడేందుకు బరిలో దిగింది.

అందరి కళ్లు అతడిపైనే

13 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ, 17 ఏళ్ల ఆయుష్‌ మాత్రే టీమ్ ఇండియాలో కీలక ప్లేయర్స్​. అయితే ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.1.10 లక్షల ధర పలికిన వైభవ్ సూర్యవంశీ, ఈ సీజన్​లో యంగస్ట్​ ప్లేయర్​గా నిలిచిన సంగతి తెలిసిందే. అతడిని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. పైగా ఇప్పుడు ఈ బీహార్ కుర్రాడు 13 ఏళ్ల వయసులోనే ఇప్పుడు అండర్ 19 జట్టుకు ఎంపికయ్యాడు. దీంతో అతడు ఆసియా కప్​ టోర్నీలో ఫేవరెట్​గా మారాడు.

ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?

భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం 10.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ పోరు జరగనుంది. అయితే ఈ అండర్ 19 ఆసియాకప్ టోర్నీ బ్రాడ్‌ కాస్టింగ్ ఇండియా రైట్స్​ను సోనీ నెట్‌వర్క్‌ దక్కించుకుంది. సోనీకి చెందిన ఛానెల్స్‌తో పాటు సోనీలివ్​ ఓటీటీలో ఈ టోర్నీ మ్యాచ్‌లు లైవ్​లో ప్రసారం అవుతాయి. అయితే సోనీ టీవీ ఛానెల్స్​తో పాటు సోనీ లీవ్ సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇకపోతే జియో, ఎయిర్టెల్ యూజర్స్ మాత్రం ఈ టోర్నీ మ్యాచ్‌లను ఫ్రీగా చూడొచ్చు. జియో టీవీ, ఎయిర్టెల్ టీవీ యాప్స్​లో సోనీ టెన్ ఛానెల్స్‌ను సెలెక్ట్ చేసుకుని మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.

మొత్తంగా ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు తలపడున్నాయి. జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, శ్రీలంక, నేపాల్ గ్రూప్-ఏలో ఉండగా, భారత్, పాకిస్థాన్, జపాన్, యూఏ గ్రూప్-బీలో ఉన్నాయి. శుక్రవారం జరిగిన టోర్నీ తొలి మ్యాచ్​లో (గ్రూప్‌-బి) బంగ్లాదేశ్‌ 45 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్‌ను పరాజయం రుచి చూపించింది.

'హైబ్రిడ్ మోడల్​కు ఒప్పుకుంటారా?- టోర్నీ నుంచి తప్పుకుంటారా?' - పాకిస్థాన్​కు ICC అల్టిమేటం

టీమ్​ఇండియా రిచెస్ట్​ క్రికెటర్​గా పంత్​ - కోహ్లీ, రోహిత్​ను వెనక్కినెట్టి! - సంపాదనో ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details