Umesh Yadav Instagram Story:టీమ్ఇండియా పేసర్ ఉమేశ్ యాదవ్ కొన్ని నెలలుగా జట్టుకు దూరమయ్యాడు. అతడు చివరిసారిగా 2023 డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత జరిగిన పలు సిరీస్‌ల్లో, టోర్నమెంట్లో బీసీసీఐ ఉమేశ్‌ను ఎంపిక చేయలేదు. అయితే ప్రస్తుతం రంజీ ట్రోఫీలో విదర్భ జట్టుకు ఆడుతున్న ఉమేశ్, టీమ్ఇండియాలో రీ ఎంట్రీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
టీమ్ఇండియాలో స్థానం సంపాదించాలంటే డొమెస్టిక్ టోర్నీల్లో రాణించాల్సిందేనని రీసెంట్గా సెలక్షన్ కమిటీ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా గుర్తు చేశాడు. ఈ నేపథ్యంలోనే రంజీలో ఆడుతున్న ఉమేశ్ టీమ్ఇండియాలో కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నాడు! ఈ టోర్నీలో ఇప్పటికే 18 వికెట్లు పడగొట్టి జట్టులో కీలక బౌలర్‌గా మారాడు.
అయితే ఇంగ్లాండ్‌తో చివరి మూడు టెస్టులకు బీసీసీఐ జట్టును ప్రకటించిన తర్వాత ఉమేశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ షేర్ చేశాడు. 'కితాబ్ పర్ దూల్ జమ్నే సే, కహానీ ఖతమ్ నహీ హోతా' (పుస్తకాలపై దుమ్ము చేరినంత మాత్రానా, కథలు ముగిసిపోవు) అని రాసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు. అయితే ఇంగ్లాండ్ సిరీస్‌కు ఎంపిక కానుందుకే ఉమేశ్ ఇలాంటి స్టోరీ షేర్ చేసి ఉంటాడని నెటిజన్లు భావిస్తున్నారు. జట్టులో అతడి పేరు లేనందున నిరాశకు గురై, జట్టులో ఎంపిక చేయకున్నా అతడి ఆట ముగిసిపోలేదని ఈ పోస్ట్‌తో ఉమేశ్ హింట్ ఇచ్చినట్లున్నాడని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.