IND VS SA Tilak Varma : టీమ్ ఇండియా విజయం సాధించిన నాలుగో టీ20 మ్యాచ్‌లో తిలక వర్మ(120; 47 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్స్‌లు) తన ఆటతీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత సిరీస్‌లో తానూ డకౌట్ అయిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.
మీకో ఫన్నీ విషయం చెప్పనా : సెంచరీపై తిలక్ వర్మ - IND VS SA TILAK VARMA
సెంచరీలు సాధించి మ్యాచ్, సిరీస్ విజయంలో కీలక వ్యవహిరించిన తిలక్ వర్మ, సంజూ శాంసన్ కామెంట్స్.
Published : Nov 16, 2024, 10:49 AM IST
"తాఫ్రికాపై వరుసగా రెండో శతకం బాదడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మీకో ఫన్నీ విషయం చెబుతాను. గత ఏడాది ఇదే వేదిక (జోహెన్నెస్‌బర్గ్)గా ఆడిన మ్యాచ్‌లో మొదటి బాల్కే బంతికే డకౌట్ అయ్యాను. మరో ఛాన్స్ వస్తే నా సత్తా నిరూపించుకోవాలని బలంగా అనుకున్నాను. ఇప్పుడు ఈ సెంచరీతో ఆ లోటు తీరింది. టీమ్ ఇండియా గెలుపొందిన ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించినందుకు చాలా ఆనందంగా ఉంది. గత మ్యాచ్‌లో ఎలాంటి ప్రదర్శన చేశానో, ఇప్పుడు కూడా అవే సూత్రాలకు కట్టుబడి బ్యాటింగ్ చేశాను. కెప్టెన్ సూర్యకుమార్‌కు మరోసారి థ్యాంక్స్ చెబుతున్నాను. సౌతాఫ్రికాలో కఠిన సవాళ్లు ఉంటాయని తెలుసు. అయితే ఈ సిరీస్‌కు ముందు గాయాల బారిన పడ్డాను. కోలుకొని తిరిగి వచ్చాక స్టేడియంలోకి అడుగు పెట్టేందుకు చాలా కష్టపడ్డాను. అందుకే, ఆ దేవుడి కోసం నా ప్లైయింగ్ కిస్ సంబరాలను చేసుకున్నాను" అని తిలక్ వెల్లడించారు. కాగా, ఈ సిరీస్‌లోని నాలుగు మ్యాచుల్లో తిలక్ 21 ఫోర్లు, 20 సిక్స్‌ల సాయంతో 280 పరుగులు సాధించాడు.