Kuldeep Yadav Marriage:టీమ్ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తాజాగా తన పెళ్లిపై ఓ క్లారిటీ ఇచ్చాడు. కొంతకాలంగా తన పెళ్లి విషయంలో వస్తున్న వార్తలకు కుల్దీప్ స్పందించాడు. ఈ క్రమంలో తను వివాహం చేసుకోబోయే అమ్మాయి బాలీవుడ్ హీరోయిన్ మాత్రం కాదని కుల్దీప్ స్పష్టం చేశాడు. 'త్వరలోనే మీరు శుభవార్త వింటారు. అయితే నేను హీరోయిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. నన్ను, నా కుటుంబ సభ్యులను బాగా చూసుకునే అమ్మాయే నాకు ముఖ్యం' అని కుల్దీప్ పేర్కొన్నాడు.
'త్వరలోనే శుభవార్త వింటారు- హీరోయిన్ను మాత్రం చేసుకోను'- పెళ్లిపై కుల్దీప్ కామెంట్స్ - Kuldeep Yadav Marriage - KULDEEP YADAV MARRIAGE
Kuldeep Yadav Marriage: టీమ్ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తాజాగా తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కచ్చితంగా హీరోయిన్ను మాత్రం చేసుకోనని చెప్పాడు.
Kuldeep Yadav Marriage (Source: Getty Images)
Published : Aug 11, 2024, 6:29 PM IST
ఇక జూన్‌లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో కుల్దీప్ అద్భుతంగా రాణించాడు. రీసెంట్గా ముగిసిన శ్రీలంక పర్యటనలో 4 వికెట్లు పడగొట్టి ఫర్వాలేదనిపించాడు. ఇక త్వరలో ప్రారంభం కానున్న బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీస్‌ల్లో కుల్దీప్ ఆడే ఛాన్స్ ఉంది.