TeamIndia VS South Africa 4th T20I :జొహానెస్‌బర్గ్ వేదికగా జరుగుతోన్న ఆసక్తికర సమరం నాలుగో టీ20లో టీమ్ ఇండియా దూకుడు ప్రదర్శించింది. దక్షిణాఫ్రికాపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, ప్రత్యర్థి జట్టు ముందు 284 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బ్యాటర్లలో సంజూ శాంసన్, తిలక్ వర్మ దక్షిణాఫ్రికా బౌలర్లను ఊచకోత కోశారు. వీరిద్దరూ చెరో సెంచరీతో శతకొట్టడం వల్ల నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ కోల్పోయి 283 పరుగులు చేసింది టీమ్ ఇండియా. అభిషేక్ శర్మ (36; 18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) పర్వాలేదనిపించాడు. లూథో సిపమ్లా ఓ వికెట్ దక్కించుకున్నాడు. కాగా, సౌతాఫ్రికాపై టీమ్ ఇండియా ఇదే అత్యధిక స్కోరు కాగా, ఓవరాల్‌గా రెండో అత్యధిక స్కోరు.
తొలి ప్లేయర్‌గా సంజూ - ఈ మ్యాచ్‌లో (109; 54 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్‌లు) సెంచరీతో ఆకట్టుకున్నాడు. 51 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీతో టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో మూడు శతకాలు బాదిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు శాంసన్. ఇంకా ఈ ఏడాది ఇప్పటి వరకు మూడు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక తిలక్ వర్మ (120; 47 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్స్‌లు) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ బాదాడు. ఈ మ్యాచ్‌లో 41 బంతుల్లో శతకం అందుకున్నాడు.