Mohammed Shami Vijay Hazare Trophy : టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం ఎన్సీఏలో విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న ఈ స్టార్ క్రికెటర్ ప్రస్తుతం కోలుకుంటూనే తన ఫిట్నెస్ సాధించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు త్వరలోనే మళ్లీ టీమ్ఇండియా తుది జట్టులోకి చేరుతాడని అందరూ భావించారు. అయితే అతడు ఇంకా కోలుకోలేదని తాజాగా జరుగుతున్న పరిణమాలను చూస్తే అర్థమవుతోంది.
హైదరాబాద్ వేదికగా శనివారం దిల్లీతో జరగనున్న విజయ హజారే ట్రోఫీ మ్యాచ్‌కు బెంగాల్ తరపున షమీ బరిలోకి దిగడం లేదంటూ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ తాజాగా ప్రకటించింది. చూస్తుంటే షమీకి ఇంకాస్త రెస్ట్ అవసం అవుతుందని తెలుస్తోంది. తన మోకాలిపై కనిపించిన వాపు ఇంకా పూర్తిగా తగ్గలేదట. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సమయంలో ఈ సమస్య బయటపడిందని అందుకే అతడి ఫిట్‌నెస్‌పై అనుమానాలు పెరిగాయని క్రికెట్ విశ్లేషకుల మాట.
మరోవైపు రోహిత్ శర్మ కూడా రీసెంట్గా జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయం గురించి స్పందించాడు. షమీ తన మోకాలి ఫిట్‌నెస్‌పై 200% విశ్వాసం లేకుంటే మేము ఎటువంటి రిస్క్ తీసుకోలేమని క్లారిటీ ఇచ్చాడు.
అది చాలా ఇంపార్టెంట్!
అయితే విజయ్ హజారే ట్రోఫీలో షమీ పాల్గొనకపోవడంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత మ్యాచుల్లో రంజీల్లో రాణించిన ఈ స్టార్ క్రికెటర్ మళ్లీ ఇలా ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటం బాధాకరమని అంటున్నారు. అంతేకాకుండా పూర్తి విశ్రాంతి తీసుకుని జట్టులోకి రావాలని కోరుకుంటున్నారు.
ఇదిలా ఉండగా, రానున్న అంతర్జాతీయ మ్యాచ్‌లకు షమీ ఫిట్నెస్ చాలా కీలకం కానుంది. ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ వంటి కీలక టోర్నమెంట్‌లకంటే ముందే, షమీ పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌తో ఉండటం టీమ్ఇండియాకు జట్టుకు చాలా అవసరమని విశ్లేషకులు అంటున్నారు.
ఇక బెంగాల్ జట్టుకు సుదీప్ కుమార్ ఘరామి సరికొత్త కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఈ జట్టులో ముకేశ్ కుమార్ లాంటి స్టార్ బౌలర్ కూడా ఉండటం ఆ టీమ్‌కు బలాన్ని చేకూరుస్తోంది. వీరితో పాటు షమీ కూడా తోడైతే ఇక ఆ జట్టు ఫుల్ జోష్‌లో దూసుకెళ్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రఫ్పాడించిన షమీ- ఫోర్లు, సిక్స్‌లతో విమర్శలకు చెక్?
షమీ, ఆస్ట్రేలియా వెళ్లడం కష్టమే? - ఇక ఆ రెండు టోర్నీలే లక్ష్యం!