Cricketers Sons Name With A Letter :టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన కొడుకుకి 'అహాన్' అని నామకరణం చేశాడు. అహాన్ అనేది సంత్కృత పదం. మేల్కొలుపు, అవగాహన అనేవి ఈ పేరు అర్థమట. ఇక హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ 'ఆహాన్ శర్మ' అనే పేరును సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనిస్తే, టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ల కుమారుల పేర్లన్నీ 'అ' అనే అక్షరంతోనే మొదలవుతున్నాయి.
స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, హార్డ్ హిట్టర్ హార్దిక్ పాండ్య, పేసర్ జస్ప్రీత్ బుమ్రా కుమారుల పేర్లు కూడా 'అ' అనే అక్షరంతోనే ఉన్నాయి. అయితే తమతమ కుమారుల పేర్లు హిందూ సంప్రదాయం ప్రకారం పెడుతున్నట్లు వాళ్లు ఇదివరకే చెప్పినా, దీని వెనుక ఏమైనా న్యూమరాలజీ ఉందా? అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ తన కుమారుడికి 'అకాయ్' అని నామకరణం చేశాడు. బుమ్రా తన కొడుకుకి 'అంగద్' అని, పాండ్య తన వారసుడికి 'అగస్త్య' అని పేరు పెట్టాడు. తాజాగా రోహిత్ సైతం తన కొడుకుకి 'అ' అనే అక్షరంతో మొదలయ్యేలా 'అహాన్' అని పేరు పెట్టాడు. దీని వెనక సీక్రెట్ ఏంటోగానీ, టీమ్ఇండియా ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన క్రికెటర్ల పిల్లల పేర్లు ఒకే అక్షరంతో ఉండడంతో ఖుషీగా ఉన్నారు. 'స్కూళ్లో ఫస్ట్ బెంచ్‌లో సీట్ కోసం ఇలా పెట్టి ఉంటారు', 'నెక్ట్స్ రాహుల్ ఏ పేరు పెడతాడో' అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.
అహాన్ :రోహిత్ శర్మ- రితికా సజ్దేను 2015లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2018 డిసెంబరులో ఓ కూతురు జన్మించింది. ఆ పాపకు సమైరా అని పేరు పెట్టారు. ఇక ఈ ఏడాది నవంబరు 15న రోహిత్- రితిక జంట రెండో బిడ్డను ఆహ్వానించారు. వీరికి పండంటి మగబిడ్డ జన్మించాడు. ఆ చిన్నారికి తాజాగా 'అహాన్' అని నామకరణం చేశారు.
అగస్త్య :స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య 2020లో తండ్రి అయ్యాడు. అతడి భార్య నటాషా స్టాన్ కోవిచ్ 2020 జులై 30న పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి అగస్త్య అని నామకరణం చేశారు.