తెలంగాణ

telangana

ETV Bharat / sports

దినేశ్ కార్తీక్ సంచలన నిర్ణయం- ఇంటర్నేషనల్ క్రికెట్​కు DK గుడ్​బై - Dinesh Karthik Retirement - DINESH KARTHIK RETIREMENT

Dinesh Karthik Retirement: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ అంతర్జాతీయ కెరీర్​కు ముగింపు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం తెలిపాడు.

Dinesh Karthik Retirement
Dinesh Karthik Retirement (Source: Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jun 1, 2024, 7:02 PM IST

Dinesh Karthik Retirement:టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల ఐపీఎల్​ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పిన డీకే, తాజాగా అన్ని ఫార్మాట్ల క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు తన నిర్ణయాన్ని శనివారం ట్విట్టర్​లో వెల్లడించాడు. 2004లో అంతర్జాతీయ క్రికెట్​లో అరంగేట్రం చేసిన డీకే 20ఏళ్ల పాటు టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలో డీకే తన కెరీర్​లో 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20 మ్యాచ్​లు ఆడాడు.

'కొన్ని రోజులుగా నాకు మద్దతుగా నిలిచి, నాపై ఆప్యాయత చూపిన ఫ్యాన్స్​ అందరికి కృతజ్ఞతలు. ఇక నా కెరీర్​కు గుడ్​బై చెప్పాలని డిసైడ్ అయ్యాను. నా సుదీర్ఘ ప్రయాణంలో నాకు మద్దతుగా ఉన్న కెప్టెన్లు, సెలక్టర్లు, సహచరులు, సహాయక సిబ్బంది అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. దేశంలో మిలియన్ల కొద్ది క్రీడాకారులు ఉన్నప్పటికీ నాకు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నా తల్లిదండ్రులు ఇన్నేళ్లుగా కెరీర్​లో నాకు పిల్లర్లుగా సపోర్ట్​గా నిలిచారు. వారి ఆశీర్వాదాలు లేనిదే నేను లేను. నా భార్య దీపికకు నేను ఎంతో రుణపడి ఉంటాను. చివరగా నన్ను అభిమానించే అందరికీ థాంక్యూ' అని ట్విట్టర్​లో రాసుకొచ్చాడు.

ఇక అంతర్జాతీయ క్రికెట్​లో టెస్టుల్లో 1025, వన్డేల్లో 1752, టీ20ల్లో 686 పరుగులు చేశాడు. మొత్తంగా దినేశ్ ఒక సెంచరీ (టెస్టుల్లో) 17 హాఫ్ సెంచరీలు బాదాడు. ఇక 2018లో ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడిన డీకే, వన్డేల్లో 2019, టీ20ల్లో 2022లో చివరిసారిగా టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు.

కాగా, ఐపీఎల్​లో 257 మ్యాచ్​లు ఆడిన దినేశ్ తనదైన మార్క్​ను చూపించాడు. ఐపీఎల్​లో దినేశ్ ముంబయి, కోల్​కతా, ఆర్సీబీ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్​లో 4842 పరుగులు నమోదు చేశాడు. అందులో 22 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక ఇటీవల ముగిసిన ఐపీఎల్​లో రాజస్థాన్​తో ఆడిన మ్యాచ్​ దినేశ్​కు చివరిది. రాబోయే రోజుల్లో డీకేను కామెంటేటర్​గా చూసే ఛాన్స్ ఉంది.

IPLకు దినేశ్ గుడ్​బై- రిటైర్మెంట్ ప్రకటించిన Dk

DK సక్సెస్​లో 'ఆమె'- దినేశ్, దీపిక బ్యూటిఫుల్ లవ్​స్టోరీ - Dinesh Karthik Love Story

ABOUT THE AUTHOR

...view details