తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్​ఇండియా హెడ్​ కోచ్ పదవి - గంభీర్‌ పెట్టిన ఐదు కండీషన్లు ఇవే! - Team India Head Coach

Team India Head Coach Gautam Gambhir : టీమ్‌ఇండియా ప్రధాన కోచ్​​ పదవికి గౌతమ్ గంభీర్​వైపే​ బీసీసీఐ మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు గంభీర్ బీసీసీఐ ఎదుట ఐదు కండీషన్లు పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. అవేంటంటే?

source Getty Images
Team India Head Coach Gautam Gambhir (source Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jun 24, 2024, 1:58 PM IST

Team India Head Coach Gautam Gambhir : టీమ్‌ఇండియా ప్రధాన కోచ్​ పదవి రేసులో గౌతమ్ గంభీర్‌ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇప్పటికే గంభీర్​ను బీసీసీఐ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. అయితే గంభీర్ బీసీసీఐ ఎదుట ఐదు కండీషన్లు పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. వాటన్నింటినీ బీసీసీఐ కూడా అంగీకరించినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. అవేంటంటే?

  • క్రికెట్​కు సంబంధించిన వ్యవహారాల్లో ఎవరి జోక్యం అస్సలు ఉండకూడదని అన్నాడట. బోర్డు నుంచి లేదా బయట నుంచి ఒత్తిళ్లను కూడా సహించే ప్రసక్తే లేదని చెప్పాడట. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మెంటార్‌గానూ గంభీర్‌ ఇలానే వ్యవహరించిన సంగతి తెలిసిందే.
  • సహాయక సిబ్బందిని ఎంచుకోవడానికి అవకాశం ఇవ్వాలి. బ్యాటింగ్‌, బౌలింగ్‌ కోచ్‌లతో పాటు ఇతర సిబ్బంది నియామకంలోనూ ఇతరుల పాత్ర ఉండకూడదని పేర్కొన్నాడట.
  • వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌ వేదికగా జరగనుంది. సీనియర్ క్రికెటర్లు రోహిత్, రవీంద్ర జడేజా, కోహ్లీ, షమీకి ఇదే లాస్ట్ ఛాన్స్​. ఒకవేళ ట్రోఫీని దక్కించుకోవడంలో టీమ్​ ఇండియా ఫెయిల్ అయితే వారందరినీ జట్టు నుంచి తప్పించేందుకు ఇబ్బంది లేకుండా ఉండాలని అన్నాడట. అయితే అది మూడు ఫార్మాట్ల నుంచా? లేదా అనేది స్పష్టత లేదు.
  • టెస్టు క్రికెట్‌కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో టీమ్​ఇండియా మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రత్యేకమైన జట్టును సిద్ధం చేయాలి. అందుకోసం భవిష్యత్తులో ప్లేయర్స్​ను ఎంపిక చేయాలి.
  • వన్డే ప్రపంచకప్‌ 2027 కోసం ఇప్పటి నుంచే రోడ్‌ మ్యాప్‌ను సిద్ధం చేసేలా అనుమతించాలి. వచ్చే సంవత్సరం వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో జట్టు ఎంపికలో స్వేచ్ఛ నివ్వాలి.

ఇకపోతే గంభీర్​తో పాటు డబ్ల్యూవీ రామన్‌ కూడా హెడ్​ కోచ్​ రేసులో ఉన్నాడు. కానీ గంభీర్‌ వైపే బోర్డు మొగ్గు చూపనుందని తెలుస్తోంది. అలానే రామన్‌ సేవలను కూడా వినియోగించుకోవాలని అనుకుంటోందని తెలిసింది. రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ఈ నెలా ఖరుతో ముగియనుంది. కాబట్టి కొద్ది రోజుల్లోనే ప్రధాన కోచ్‌ ఎవరు అనేది బీసీసీఐ అఫీషియల్​గా అనౌన్స్ చేయనుంది.

ABOUT THE AUTHOR

...view details