Rohit Sharma Test Records :కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు టీమ్ఇండియా సిద్ధమౌతోంది. ఈ సిరీస్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఇక సెప్టెంబర్ 19న చెన్నై వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా ప్లేయర్లంతా చెన్నై చేరుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టేశారు. ఈ క్రమంలోనే కెప్టెన్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. అదేంటంటే?
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డుపై హిట్‌మ్యాన్ కన్నేశాడు. రోహిత్ శర్మ టెస్టుల్లో ఇప్పటివరకు 84 సిక్స్‌లు బాదాడు. ఈ క్రమంలో సుదీర్ఘ ఫార్మాట్ క్రికెట్లో అత్యధిక సిక్స్‌లు బాదిన టీమ్ఇండియా బ్యాటర్ల లిస్ట్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో సెహ్వాగ్ (90 సిక్స్‌లు) టాప్‌లో ఉన్నాడు. అయితే రోహిత్ మరో 7 సిక్స్‌లు బాదితే టెస్టుల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. బంగ్లాతో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న తరుణంలో రోహిత్ ఈ సిరీస్‌లోనే ఈ సెహ్వాగ్ రికార్డు బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది! అయితే ప్రస్తుతం యాక్టీవ్ ప్లేయర్లలో మాత్రం రోహిత్ శర్మే టాప్‌లో కొనసాగుతున్నాడు.
టెస్టుల్లో అత్యధికి సిక్స్‌లు బాదిన భారత బ్యాటర్లు
వీరేంద్ర సెహ్వాగ్ | 90 |
రోహిత్ శర్మ | 84* |
ఎమ్ ఎస్ ధోనీ | 78 |
సచిన్ తెందూల్కర్ | 69 |
రవీంద్ర జడేజా | 64* |