MS Dhoni Social Media Presence : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ సోషల్ మీడియాలో ఎక్కువడా యాక్టీవ్‌గా ఉండడు. వరల్డ్ క్రికెట్లో ధోనీకి అత్యంత ప్రజాదరణ ఉన్నప్పటికీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌తో మాత్రం కాస్త గ్యాప్ మెయింటేన్ చేస్తాడు. 2024 జులైలో అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో చివరిసారిగా పోస్ట్ షేర్ చేశాడు. అయితే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండాలని తన మేనేజర్లు పలుమార్లు సూచించినప్పటికీ ధోనీ ఆ సలహాలను లెక్కచేయలేదనని రీసెంట్గా పాల్గొన్న ఇంటర్వ్యూలో తెలిపాడు.
తాను సోషల్ మీడియాపై ఆసక్తి ఉండదని ధోనీ అన్నాడు. 'సోషల్ మీడియా అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. అయినప్పటికీ అందులో యాక్టీవ్‌గా ఉండాలని నా మేనేజర్లు చెబుతూ ఉంటారు. 2004లో నేను నా కెరీర్ ప్రారంభించాను. అప్పుడప్పుడే ట్విట్వర్ పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ వచ్చింది. దీంతో కొంత పబ్లిక్ రిలేషన్స్ PR (ప్రమోషన్స్ లాంటిది) చేయాలని నా మేనేజర్లు తరచూ చెప్పేవారు. అయితే 'మంచి క్రికెట్ ఆడితే, మనకు PR అవసరం ఉండదు' అని నేను వాళ్లకు చెప్పేవాడిని అని ధోనీ వివరించాడు.
సాక్షి కాంప్లిమెంట్
అలాగే తన భార్య సాక్షి సింగ్ నుంచి వచ్చిన ప్రశంస గురించి కూడా ధోనీ షేర్ చేసుకున్నాడు. 'మనలో చాలా మంది తమ భార్యలను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. నేను కూడా అలా చేసినవాడినే. నాకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. కానీ, నా భార్య మాత్రం 'జీవితంలో అన్ని బాగా చేశావు' అని చెప్పింది. నాకదే అతి పెద్ద ప్రశంస. ఎందుకంటే ఎక్కువగా పొగుడుతూ ఉండదు. అందుకే, భార్యలను భర్తలు ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు' అని ధోనీ అన్నాడు.
న్యూ ఇయర్ స్పెషల్ డ్యాన్స్
ధోనీ తన భార్య సాక్షితో కలిసి గోవాలో న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నాడు. ఈ వేడుకలో సాక్షితో కలిసి డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీరిద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ అభిమానులను ఆకట్టుకుంటుంది.
ధోనీ ఇంట క్రిస్మస్ సందడి - శాంతాక్లాజ్‌గా సర్ప్రైజ్ చేసిన మిస్టర్ కూల్
భార్యతో కలిసి ధోనీ డ్యాన్స్ - మిస్టర్ కూల్ స్టెప్పులు సూపర్!