Drunked Man Sleep on The Electric Wires : మద్యం మనిషితో ఎంతటి పనైనా చేయిస్తుంది. మత్తులో విచక్షణ కోల్పోయి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. మద్యం కిక్కులో ఏం చేస్తున్నారో కూడా తెలియదు. ఇలా మోతాదుకు మించి మద్యం తాగి, ప్రాణాల మీదకు తెచ్చుకునే వారు చాలా మంది ఉన్నారు. వాళ్ల చేష్టలు చూసే వాళ్లకు కొన్నిసార్లు కామెడీగా అనిపించినా, మరికొన్ని సార్లయితే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. అలాంటి ఘటనే ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది.
మద్యం మత్తులో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. మద్యం తాగి ఆ మత్తులో గ్రామంలోని ప్రధాని కూడలి వద్ద ఉన్న స్తంభం ఎక్కి విద్యుత్ తీగలపై పడుకున్నాడు. పాలకొండ మండలం ఎం.సింగపురం గ్రామానికి చెందిన ఎజ్జల వెంకన్న వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. తన ఇంట్లోని కుటుంబ సభ్యులతో గొడవ జరగడంతో విద్యుత్ స్తంభం ఎక్కాడు. అతను కరెంట్‌పోల్ ఎక్కుతుండగా గమనించిన స్థానికులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో ఏకంగా కరెంటు తీగలపైనే పడుకుని హంగామా సృష్టించాడు. రకరకాల విన్యాసాలు చేస్తూ అక్కడి వారిని ఆందోళనకు గురి చేశాడు. విద్యుత్ తీగలపై పడుకున్న వెంకన్నను గమనించిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళనతో కేకలు వేశారు. కొద్దిసేపటి తర్వాత వెంకన్నను బలవంతంగా కిందకు దించారు. అంతటితో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
మందుబాబు వీరంగం : పక్కకు జరగమన్న పాపానికి మహిళా కండక్టర్, డ్రైవర్‌పై విచక్షణారహితంగా దాడి
ట్రాఫిక్ పోలీసులను పరుగులు పెట్టించిన మందుబాబు - Drunker Fight With Police