ETV Bharat / sports

వరల్డ్‌ బ్లిట్జ్‌ ఛాంపియన్‌షిప్‌ 2024 - వైశాలికి కాంస్యం - WORLD BLITZ CHESS CHAMPIONSHIP 2024

వరల్డ్‌ బ్లిట్జ్‌ ఛాంపియన్‌షిప్‌ - యంగ్ చెస్ ప్లేయర్ వైశాలికి కాంస్యం

Etv BharatFIDE World Blitz Chess Championship 2024
R Vaishali (Etv Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 1, 2025, 12:43 PM IST

FIDE World Blitz Chess Championship 2024 : తాజాగా జరిగిన వరల్డ్‌ బ్లిట్జ్‌ ఛాంపియన్‌షిప్‌ మహిళల విభాగంలో భారత్‌కు చెందిన ఆర్‌.వైశాలి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. క్వార్టర్‌ ఫైనల్స్‌లో చైనాకు చెందిన జు జినార్‌పై 2.5-1.5 తేడాతో వైశాలి గెలిచింది. అయితే సెమీస్‌లో చైనాకు చెందిన జు వెంజన్‌ చేతిలో 0.5-2.5 తేడాతో ఓటమిని చవి చూసింది. ఇక ఇటీవలె ర్యాపిడ్‌ ఈవెంట్‌లో కోనేరు హంపి టైటిల్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే.

దేశం మరింత గర్వపడేలా చేసింది
మరోవైపు వైశాలి విజయాన్ని కొనియాడుతూ చెస్ అభిమానులు, పలువురు ప్రముఖులు నెట్టింట పోస్ట్​లు పెడుతున్నారు. ఈ క్రమంలో చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌, ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ అయిన సీనియర్ ప్లేయర్ విశ్వనాథన్‌ ఆనంద్‌ ఆమె విజయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. వైశాలిపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఇక ర్యాపిడ్ ఈవెంట్ టైటిల్​ను గెలుచుకున్న కోనేరు హంపిని కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా అభినందించారు.

"వరల్డ్‌ బ్లిట్జ్‌ ఛాంపియన్‌షిప్‌లో మెడల్ సాధించిన వైశాలికి అభినందనలు. ఆమె దేశం మరింత గర్వపడేలా చేసింది. ఆమెకూ, ఆమె చెస్‌కు మద్దతు ఇస్తున్నందుకు ఎంతో చాలా సంతోషంగా ఉన్నాం." అంటూ ట్విట్టర్​ వేదికగా విశ్వనాథన్‌ ఆనంద్‌ హర్షం వ్యక్తం చేశారు.

ఇద్దరు ప్లేయర్స్ - ఒకే టైటిల్ !
ఇదిలా ఉండగా, పురుషుల ఓపెన్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌ ప్లేయర్ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ రష్యాకు చెందిన ఇయాన్‌ నెపోమ్నియాచితో తలపడ్డారు. అయితే మూడు సార్లు వీళ్ల గేమ్‌ డ్రాగా ముగిసింది. దీంతో ఆ టైటిల్‌ను ఈ ఇద్దరూ పంచుకోవాల్సి వచ్చింది.

అయితే గతంలో డ్రెస్‌ కోడ్ పాటించకపోవడం వల్ల మాగ్నస్‌పై చీఫ్ ఆర్బిటర్ అలెక్స్ హోలోసక్ అనర్హత వేటు వేశారు. అంతేకాకుండా అతడికి 200 డాలర్ల జరిమానా కూడా విధించారు. జీన్స్ వేసుకొని ఈవెంట్‌లో పాల్గొన్న మాగ్నస్‌కు ఈ ఫైన్‌ పడింది. ఇదే తప్పిదం గతంలోనూ చేశాడు. ఇప్పుడు మరోసారి అలాగే చేయడంతో అతడిపై వేటు కూడా పడింది.

వరల్డ్​ ఛాంపియన్​గా కోనేరు హంపి- తెలుగు గ్రాండ్ మాస్టర్ అరుదైన ఘనత!

పెరిగిన వరల్డ్​ చెస్ ఛాంపియన్ గుకేశ్‌ నెట్​వర్త్​ - ఇప్పుడు అతడి ఆదాయం ఎన్ని కోట్లంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.