The Maternal Bond Of The Cow Calf : ఈ సృష్టిలో తల్లి ప్రేమను మించినటు వంటిది మరొకటి ఉండదంటే అతిశయోక్తి లేదు. తల్లి ప్రేమ మనుషులకే కాదు మూగజీవాలకూ ఉంటుందని నిరూపితమైన ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక మార్కెట్ ఏరియా బస్ స్టాప్‌లో నుంచి ఆర్టీసీ బస్సును వెనక్కి తీస్తుండగా ఆరు నెలల వయసున్న లేగ దూడ దాని చక్రాల కింద పడి మృతి చెందింది. అక్కడే ఉన్న తల్లి ఆవు ఇది గమనించి లేగదూడ చుట్టూ తిరగడం ప్రారంభించింది.
ఎవర్నీ లేగదూడ దగ్గరకు రానివ్వని తల్లి ఆవు : ఈ క్రమంలోనే మరికొన్ని ఆవులు, ఎద్దులు, దూడలు అక్కడికి చేరుకుని మృత్యువాత పడిన దూడను తట్టిలేపేందుకు యత్నించాయి. ఈ దృశ్యం చూపరులను కదిలించింది. ఆగ్రహంతో ఉన్న తల్లి ఆవు చాలాసేపు స్థానికులెవర్నీ దగ్గరికి రానివ్వలేదు. చివరకు స్థానిక ఆటో డ్రైవర్లు దూడను పక్కకు తొలగించారు.
లెక్కచేయని ఆవుల యజమానులు : ఇటీవల ఇలాంటి సంఘటనలు సింగరేణి ప్రాంతంలో చోటు చేసుకుంటున్న పశువుల యజమానుల తీరు మాత్రం మారడం లేదు. పశువులను ఇళ్ళలో కట్టేసుకోవాలని పోలీసులు, పురపాలిక శాఖ అధికారులు హెచ్చరిస్తున్న యజమానులు మాత్రం లెక్కచేయడం లేదు. యజమానుల నిర్లక్ష్యానికి మూగజీవాలు బలవుతుండడం అందరిని కలిసి వేస్తోంది.
Dog And Snake Fight: పిల్లల కోసం పాముతో ఆ తల్లి పోరాటం చివరకు...?
అమ్మ ప్రేమ కదా సార్ ఇలానే ఉంటుంది.. కన్నీరు తెప్పించే ఓ వానరం కథ