ETV Bharat / international

కొత్త ఏడాది- కొత్త తరం! ఇకపై పుట్టిన వారంతా 'జనరేషన్ బీటా'- సర్వం టెక్నాలజీమయం! - GEN BETA 2025

2025 జనవరి 1 నుంచి పుట్టిన వారిని జెన్ బీటాగా పరిగణన- సాంకేతిక యుగమంతా వారిదే!

gen beta 2025
gen beta 2025 (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 1, 2025, 4:48 PM IST

Updated : Jan 1, 2025, 4:57 PM IST

Gen Beta 2025 : 2025 జనవరి 1 నుంచి మనకు కొత్త సంవత్సరం మాత్రమే కాదు, ఒక కొత్త తరం కూడా ప్రారంభమైంది. ఏమిటి కొత్త తరమా అని ఆశ్చర్యపోకండి! ఇది నిజమే. 2025 జనవరి 1వ తేదీ నుంచి పుట్టే పిల్లల్ని 'జనరేషన్ బీటా' గా పరిగణిస్తారు. అసలేంటీ 'జనరేషన్ బీటా'? ఎప్పటి వరకు పుట్టినవారిని ఈ తరంగా పరిగణిస్తారు? వారు ఎదుర్కొనబోయే సవాళ్లేంటి? తదితర విషయాలు తెలుసుకుందాం.

జనరేషన్ బీటా?
2025 జనవరి 1 నుంచి 2039 డిసెంబరు 31 వరకు జన్మించిన పిల్లల్ని జనరేషన్ బీటాగా వ్యవహరించనున్నారు. ఈ జనరేషన్ బీటా పిల్లలు ప్రపంచ జనాభాలో 16 శాతం ఉంటారని అంచనాలు ఉన్నాయి. వీరిలో చాలా మంది 22వ శతాబ్దపు ఆవిర్భావాన్ని చూడగలుగుతారు. డిజిటల్ టెక్నాలజీని చూసిన జెనరేషన్ జెడ్​లా కాకుండా, జెన్ బీటా పిల్లలు సాంకేతిక పురోగతి, ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ), ఆటోమేషన్ వారి దైనందిన జీవితంలో ప్రధాన భాగంగా ఉంటాయి.

సాంకేతిక ప్రపంచంలో జనరేషన్ బీటా
వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వంటిని జనరేషన్ బీటా పిల్లల జీవితాలను ప్రభావితం చేసే ముఖ్యమైన సమస్యలని మోనాశ్ సెంటర్ ఫర్ యూత్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ ప్రాక్టీస్ డైరెక్టర్ లూకాస్ వాల్ష్ తెలిపారు. అయితే ఈ పిల్లలు పెరిగేకొద్దీ, వారు అనేక సామాజిక సవాళ్లతో పోరాడుతున్న ప్రపంచాన్ని చూడాల్సి వస్తుందని పేర్కొన్నారు. జనరేషన్ బీటా పూర్తిగా సాంకేతిక ప్రపంచంలో పెరుగుతారని అభిప్రాయపడ్డారు.

ప్రతి 14 ఏళ్ల ఒకసారి జనరేషన్ ఛేంజ్!
1997 నుంచి 2010 సంవత్సరాల మధ్య పుట్టిన వాళ్లను జెనరేషన్ జెడ్​ కాగా, 2010- 2024 మధ్య పుట్టిన పిల్లలను జెన్ ఆల్ఫా అని, ఇప్పుడు 2025 జనవరి 1వ తేదీ నుంచి 2039 డిసెంబర్ 31వ తేదీ వరకు పుట్టబోయే వారిని జెన్ బీటాగా వ్యవహరించనున్నారు. ఇలా ప్రతి 14 ఏళ్లకొకసారి జనరేషన్ మారుతూ ఉంటుంది. జనరేషన్ ఆల్ఫా 2024 డిసెంబరు 31తో ముగిసింది.

Last Updated : Jan 1, 2025, 4:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.