T20 Worldcup 2024 Semi Final : టీ20 ప్రపంచకప్ 2024లో సూపర్-8 రసవత్తరంగా కొనసాగుతోంది. గ్రూప్-1లో ఆసీస్ జట్టుపై అఫ్గాన్ సంచలన విజయం సాధించడంతో సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన టీమ్ ఇండియా దాదాపుగా సెమీస్ చేరినట్లే! ఈ నేపథ్యంలో సోమవారం(జూన్ 24) టీమ్‌ఇండియాతో మ్యాచ్ ఆస్ట్రేలియాకు చావోరేవో లాంటిదనే చెప్పాలి. గెలిస్తే 4 పాయింట్లతో రేసులో ఉంటుంది. బంగ్లాదేశ్ చేతిలో అఫ్గానిస్థాన్ ఓడితే టీమ్ ఇండియా, ఆస్ట్రేలియా సెమీస్ చేరుతాయి.
ఒకవేళ అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా గెలిస్తే అప్పుడు వీటితో పాటు టీమ్ఇండియా కూడా 4 పాయింట్లతో సమంగా నిలుస్తుంది. ఆ పరిస్థితిలో నెట్ రన్‌రేట్ కీలకం అవుతుంది. ప్రస్తుతం టీమ్ ఇండియా 2.425 రన్‌రేట్‌తో ఉంది. అఫ్గానిస్థాన్ -0.650 కన్నా ఆస్ట్రేలియా 0.223 రన్‌రేట్ మెరుగ్గా ఉంది. ఒకవేళ ఆస్ట్రేలియా ఓడిపోయినా రేసులో ఉంటుంది. కానీ ఆ జట్టు ముందడుగు వేయాలంటే బంగ్లాదేశ్ చేతిలో అఫ్గానిస్థాన్ ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడు కూడా నెట్ రన్‌రేట్ ఆధారంగానే ఆస్ట్రేలియా ముందడుగు వేస్తుంది.